Mahesh Babu Shivaratri Special Poster: ‘సర్కారు వారి పాట’ నుంచి మహాశివరాత్రి సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. అభిమానులకు మహేష్ బాబు శివరాత్రి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ మూవీ మే 12న విడుదల కానుంది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవల కళావతి పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట యూట్యూబ్ లో 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను క్రాస్ చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. అలాగే 1.3 మిలియన్స్‌కు పైగా లైక్స్ సాధించింది. కాగా తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మార్చి చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Also Read: బాలీవుడ్‌లో భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ కారణం వల్లే లేట్ అయిందంట
కాగా ఈ సినిమాలో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ మధ్య సాగే ట్రాక్ కూడా చాలా ఎంటర్ టైన్ గా ఉంటుందట. మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. అన్నట్టు మహేష్ ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమా పై పని చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు.
Also Read: బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడిస్తున్న భీమ్లానాయక్
Box office ki uchakothe 💥#SVPMarchMadnessBegins #SarkaruVaariPaata @urstrulyMaheshhttps://t.co/cQt1J3LxhC pic.twitter.com/MAf9Mm3ZFI
— Uday 🔔 (@theMBfan) March 1, 2022
[…] Also Read: మహాశివరాత్రి నాడు మాస్ అవతార్ లో మహ… […]