https://oktelugu.com/

Game Changer: ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ నుండి లీకైన డైలాగ్స్..ఆ పార్టీ నాయకుడిపై సెటైర్లు మామూలు రేంజ్ లో లేవుగా!

హైదరాబాద్ లో సెన్సేషన్ గా మారిన హైడ్రా గురించి ఎలివేషన్స్ ఇస్తూ భారీ డైలాగ్స్ ఉంటాయని, అలాగే ప్రతినాయక పాత్రకి ట్రైలర్ లో హీరో ఇచ్చే కౌంటర్లు ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేస్తున్న రాజకీయాలకు పంచ్ గా ఉంటుందని టాక్.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 08:07 AM IST

    Game Changer(4)

    Follow us on

    Game Changer: ఇండియన్ మూవీ లవర్స్ ద్రుష్టి నెమ్మదిగా ఇప్పుడు ‘పుష్ప 2’ నుండి ‘గేమ్ చేంజర్’ వైపు మారబోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి ఫ్యాన్స్ నుండి, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన ‘డోప్’ లిరికల్ వీడియో సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ నుండి అద్భుతమైన డ్యాన్స్ చూసే అదృష్టం కలిగింది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ‘డల్లాస్’ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ నెల 27వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది.

    ఈ ట్రైలర్ ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ లెవెల్ లో ఏర్పాటు చేసి విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ ట్రైలర్ లోని కంటెంట్ గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు అభిమానులను ఉర్రూతలూ ఊగించేలా చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే థియేట్రికల్ ట్రైలర్ అభ్హిమానుల్లో ఎక్కడ లేని జోష్ ని నింపే విధంగా ఉంటుందట. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సన్నివేశాలను తీసాడు. ఇవి మన రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు కానీ, ఆయన వీటిని నాలుగేళ్ల క్రితమే అలోచించి ఈ సన్నివేశాలను రాసుకున్నాడని దిల్ రాజు డల్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపాడు.

    అయితే హైదరాబాద్ లో సెన్సేషన్ గా మారిన హైడ్రా గురించి ఎలివేషన్స్ ఇస్తూ భారీ డైలాగ్స్ ఉంటాయని, అలాగే ప్రతినాయక పాత్రకి ట్రైలర్ లో హీరో ఇచ్చే కౌంటర్లు ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేస్తున్న రాజకీయాలకు పంచ్ గా ఉంటుందని టాక్. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలంగా మారిపోతాడని, వింటేజ్ శంకర్ మాస్ అంటే ఏంటో ఈ తరం ప్రేక్షకులకు మరోసారి తెలిపేలా ఈ ట్రైలర్ ఉంటుందని టాక్. ప్రస్తుతం ఈ ట్రైలర్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫైనల్ మిక్సింగ్ జరుగుతుందట. చూడాలి మరి ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై హైప్ ఏ రేంజ్ లో పెరగబోతుంది అనేది. ఇకపోతే జనవరి నాల్గవ తేదీన రాజముండ్రి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చెయ్యనున్నారు. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.