https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను అపాయింట్ మెంట్ ఇవ్వాకపోవడానికి అసలు కారణం ఇదేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సక్సెస్ లను సాధిస్తూ పాన్ ఇండియాలో తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్.

Written By:
  • Gopi
  • , Updated On : December 24, 2024 / 08:16 AM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సక్సెస్ లను సాధిస్తూ పాన్ ఇండియాలో తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్…ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక దాంతో పాటు పుష్ప 2 సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియాలో తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ గొప్ప గుర్తింపును కూడా సొంతం చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన మన మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన మీద కేసుకు సంబంధించిన వీడియోలను చూపించి తనదే తప్పు అనేలా పకడ్బందీ వీడియోలను పోలీసులు రెడీ చేసి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ కేసులో కనుక అతనికి శిక్ష పడితే ఎన్ని రోజులు జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అతన్ని కాపాడడానికి ఎవరు ప్రయత్నించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి సమయం లో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సైతం అల్లు అర్జున్ కి బాసటగా నిలుస్తాడని అందరూ అనుకున్నప్పటికి అల్లు అర్జున్ ను కలవడానికి కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వాలని అనుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొన్నటిదాకా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరించాడు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ అవసరం ఉందని తనను కలవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…

    ఇక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరికీ సపోర్టుగా మాట్లాడినా కూడా అతని మీద వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ముందుకు దూసుకెళ్తున్న అల్లు అర్జున్ మీద ఇలాంటి ఒక మచ్చ ఏర్పడడం అనేది ఇప్పుడు తనని కోలుకోలేకుండా చేస్తుందనే చెప్పాలి.

    ఇక రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన చాలా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా, తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన కేసు ఎక్కడ వరకు వెళ్తుంది. దానిని సాల్వ్ చేసే వారు ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు…