Johnny Master : ఈ ఏడాది నేషనల్ లెవెల్ లో సెన్సేషనల్ టాపిక్స్ గా నిల్చిన సెలెబ్రిటీస్ లో ఒకరు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఆయన టాలెంట్ ని దేశం మొత్తం నచ్చింది. అందుకే తెలుగు తో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా ఆయనకి వరుసగా అవకాశాలు వచ్చాయి. తన అద్భుతమైన స్కిల్స్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలా ఇండియా లోనే నెంబర్ 1 డ్యాన్సర్ గా దూసుకుపోతున్న సమయంలో ఆయన అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. తన టీం లో అసిస్టెంట్ డ్యాన్సర్ గా పని చేసే శ్రేష్టి వర్మ అనే అమ్మాయి, జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేసాడని, తనని పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో సంచలన ఆరోపణలు చేస్తూ కేసు వేసింది.
దీంతో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి, ఆయన్ని కోర్టు లో హాజరు పరిచి, నెల రోజుల పాటు రిమాండ్ కి తరలించి విచారించిన పోలీసులు, చివరికి మధ్యంతర బెయిల్ మీద విడుదల చేసారు. బయటకి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ కి అవకాశాలు మళ్ళీ దొరుకుతాయా అని అందరూ అనుకున్నారు. మొదట్లో కాస్త కష్టం గా ఉన్నింది కానీ, ఇప్పుడు మళ్ళీ ఆయన చిన్నగా ఫామ్ లోకి వస్తున్నాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై ప్రశ్నలు వేయగా జానీ మాస్టర్ ఇచ్చిన రియాక్షన్ ని చూసి ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. యాంకర్ ఆయన్ని ప్రశ్న అడుగుతూ ‘అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసారు, మిమ్మల్ని అరెస్ట్ చేసారు. మన టాలీవుడ్ నుండి నేషనల్ అవార్డ్స్ అందుకున్న మీరిద్దరూ అరెస్ట్ అవ్వడం పై మీరేమి అంటారు?’ అని అడగగా, జానీ సమాధానం చెప్పకుండా కోపం తో వెళ్ళిపోతాడు.
అప్పట్టి వరకు చాలా కూల్ గా అడిగిన ప్రతీ ప్రశ్నకి సమాధానం చెప్పిన ఆయన అల్లు అర్జున్ మ్యాటర్ తియ్యగానే ఎందుకు అలా వెళ్ళిపోయాడు అని సోషల్ మీడియా లో అభిమానులు చర్చించుకుంటున్నారు. జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక, అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ హస్తం ఉందని చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రూమర్ బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు జానీ మాస్టర్ రియాక్షన్ చూస్తుంటే, సోషల్ మీడియా లో ప్రచారమైన ఆ రూమర్ నిజమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా అల్లు అర్జున్ కి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏమిటి?, అతని ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించాడు, ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడం ఇంతకు ముందు మనం చూసాము, అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా చేసాడు ?, అసలు నిజమేంటి, ఇవన్నీ తెలియాలంటే జానీ మాస్టర్ నోరు విప్పాల్సిందే.
అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అడగగానే జానీ మాస్టర్ ఎలా వెళ్లిపోయాడో చూడండి..@alluarjun @AlwaysJani #AlluArjun #JaniMaster #SandhyaTheatreTragedy #RTV pic.twitter.com/wdT7smNS7n
— RTV (@RTVnewsnetwork) December 23, 2024