
కొవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఐదు ఆస్పత్రుల కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం శనివారం తాజాగా మరో ఐదు ఆస్పత్రుల కొవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసింది. ఇమేజ్ ఆస్పత్రి ( అమీర్ పేట) అంకురా ఆస్పత్రి (ఎల్బీనగర్) సాయి లైఫ్ ఆస్పత్రి (భూత్ పూర్, మహబూబ్ నగర్ ) సాయి సిద్దార్థ్ ఆస్పత్రి ( షాపూర్ నగర్, సంగారెడ్డి,) అనుమతులను రద్దు చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని మొత్తం 115 ఫిర్యాదులు అందాయి.