
కరోనా మహమ్మారి కాటుకు మరో రాజకీయ నాయకుడు బలయ్యారు. ఇప్పటికే ఎందరో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులను కరోనా వైరస్ పొట్టనపెట్టుకున్నది. తాజాగా బీహార్ కు చెందిన జేడీయూ కీలక నేత తన్వీర్ అఖ్తర్ కూడా కరోనా బారిన పడి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన బీహార్ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.