Evening Walking Benefits: మనం తిన్న వెంటనే నిద్ర పోకూడదు. భోజనం తరువాత కాసేపు వాకింగ్ చేస్తే ఎంతో మంచిది. దీని వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఫలితంగా మంచి నిద్ర మన సొంతం అవుతుంది. దీని వల్ల మన ఆరోగ్యం దెబ్బతినకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం భోజనం తరువాత నడక చాలా మంచిది.
నడక వల్ల..
రోజు సాయంత్రం బోజనం అనంతరం వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అందుకే ప్రతి రోజు నడక అనేక రకాల లాభాలు కలిగిస్తుంది. భోజనం తరువాత నడక వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. దీంతో నడక మన ఆరోగ్యానికి ఎంతో అవసరం అని గుర్తించాలి.
గుండె జబ్బులు రాకుండా..
గుండె జబ్బులు రాకుండా నిరోధించడంలో కూడా నడక ఉపయోగపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే మన రక్త ప్రసరణ బాగుండాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో మనకు గుండె జబ్బుల ముప్పు రాకుండా ఉండాలంటే సాయంత్రం నడక కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.
మానసిక ప్రశాంతత
రాత్రి సమయంలో మనం నడవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి లేకుండా పోతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మానసికంగా మనం ప్రశాంతంగా ఉంటే మన అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ బాగుపడుతుంది. కండరాలు పట్టు తప్పకుండా ఉంటాయి. ఎముకలు బలంగా కావడానికి సహకరిస్తుంది.
మంచి నిద్రకు..
భోజనం చేసిన తరువాత నడవడం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మనకు మంచి నిద్ర రావడానికి కారణమవుతుంది. మన ఆలోచనలు బాగుండేలా చేస్తుంది. వారానికి కనీసం 75 నిమిషాల పాటు నడిస్తే శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది. దీని వల్ల గుండె జబ్బుల ముప్పు కూడా 17 శాతం తగ్గించడానికి సహకరిస్తుంది.