IPL 2025 (5)
IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో హైదరాబాద్ జట్టు ఈసారి అద్భుతమైన ప్లేయర్లను కొనుగోలు చేసింది. గత సీజన్లో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన హైదరాబాద్.. ఈసారి ఎలాంటి తప్పుకు ఆస్కారం ఇవ్వకూడదని భావించి.. బలమైన జట్టును రూపొందించుకుంది.
ట్రావిస్ హెడ్(Travis head), అభిషేక్ శర్మ(Abhishek Sharma), క్లాసెన్(klassen), నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) వంటి వారితో ఇప్పటికే హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ జట్టులోకి ఈశాన్ కిషన్ (Ishan kishan)చేరాడు. అతడిని మెగా వేలంలో హైదరాబాద్ జట్టు 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. సీజన్ మొదలు పెట్టకముందే ఇంట్రాడే మ్యాచ్ లలో కిషన్ అదరగొడుతున్నాడు. దీంతో అతడిని కొనుగోలు చేసి కావ్య మారన్ మంచి పని చేసిందని హైదరాబాద్ జట్టు అభిమానులు భావిస్తున్నారు. హైదరాబాద్ జట్టు రాజీవ్ గాంధీ స్టేడియం లో ముంబరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లలో ఇషాన్ కేవలం 42 బంతులు ఎదుర్కొనే 113 రన్స్ చేశాడు. తొలి మ్యాచ్లో 23 బంతుల్లోనే 64 రన్స్ చేశాడు. ఇక మంగళవారం జరిగిన రెండవ మ్యాచ్లో 19 బంతుల్లోనే 49 రన్స్ చేశాడు.
సూపర్బ్ ఫామ్
ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడతాడు. ఏడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో కిషన్ లో దూకుడు మరింత పెరిగింది. రంజి మ్యాచులలో విధ్వంసం సృష్టించాడు. జాతీయ జట్టులో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగానే తన సత్తా ఏమిటో చూపించడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు భయం పుట్టించేలాగా ఆడుతున్నాడు. సిక్సర్లను అవలీలగా కొట్టేస్తున్నాడు. ఎడమ చేతి వాటం గల ఈ ఆటగాడు ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తాడని హైదరాబాద్ అభిమానులు భావిస్తున్నారు.. అయితే ఈసారి హైదరాబాద్ జట్టులో క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, వంటి మిడిల్ ఆటగాళ్లు ఉండడంతో స్కోరు 300 నుంచి దాటినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
300 పరుగులు అలా మిస్సయ్యాయి..
సీజన్లో హైదరాబాద్ జట్టు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 30వ మ్యాచ్లో కేవలం 20 ఓవర్లలోనే 287 పరుగులు చేసింది. బెంగళూరు జట్టుపై హైదరాబాద్ ఆటగాళ్లు 22 సిక్సర్లు కొట్టారు. హెడ్ 41 బంతుల్లో 102 రన్స్ చేశాడు.. క్లాసెన్ 31 బంతుల్లో 67, అబ్దుల్ సమద్ పది బంతుల్లో 37 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.. ఇక ప్రస్తుతం ఇషాన్ కిషన్ జట్టులో చేరడంతో హైదరాబాద్ బ్యాటింగ్ అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది.. హైదరాబాద్ నుంచి గత సీజన్లో ఇద్దరు ఆటగాళ్లు 74 సిక్సర్లు కొట్టారు. అభిషేక్ శర్మ ఒక్కడే 42 సిక్సర్లు కొట్టాడంటే పరిస్థితి ఇలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత సీజన్లో హెడ్ 32 సిక్సర్లు కొట్టాడు. క్లాసెన్ 38 సిక్సర్లు బాదాడు. అయితే ఈ సీజన్లో హైదరాబాద్ ఆటగాళ్లు గనక రాణించగలిగితే.. మైదానంలో పెను విద్వంతం జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.