iPhone : ఐఫోన్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి. యాపిల్ తాజాగా 150కి పైగా దేశాల్లో మెర్సెనరీ స్పైవేర్ అటాక్ గురించి హెచ్చరికను జారీ చేసింది. ఈ కొత్త స్పైవేర్ ఐఫోన్ హోల్డర్లను టార్గెట్ చేయగలదని కంపెనీ హెచ్చరించింది. మీడియా కథనాల ప్రకారం.. ఈ తరహా స్పైవేర్ వెనుక ఉన్నవారికి చాలా సోర్సెస్ ఉన్నాయి. దీని కారణంగా సాధారణ దాడులు లేదా వైరస్‌ల కంటే ఈ కొత్త స్పైవేర్ మరింత ప్రమాదకరంగా మారవచ్చు.
యాపిల్ కంపెనీ ఈ తరహా హెచ్చరికను జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూలైలో కూడా ఇలాంటి స్పైవేర్ గురించి ఐఫోన్ యూజర్లను అప్రమత్తం చేసింది. తాజాగా కొంతమంది జర్నలిస్టులతో సహా ఇతర ఐఫోన్ యూజర్లకు అలారం మోగించే నోటిఫికేషన్‌లు వచ్చాయి. వారు ఈ కొత్త, ప్రమాదకరమైన స్పైవేర్ లక్ష్యంగా మారవచ్చని ఆ నోటిఫికేషన్‌ల సారాంశం. ప్రస్తుతం ఈ స్పైవేర్ ఎవరిని టార్గెట్ చేసుకుంటుందో కంపెనీ వెల్లడించలేదు.
Also Read : యాపిల్‌పై సుంకాల భారం.. భారత్‌లో ఉత్పత్తి విస్తరణకు సన్నాహం!
కంపెనీ ఈ అలర్ట్ యాపిల్ అధికారిక థ్రెట్ నోటిఫికేషన్స్‌లో భాగం. తీవ్రమైన సైబర్ దాడుల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి కంపెనీ దీనిని ఉపయోగిస్తుంది. యాపిల్ సపోర్ట్ పేజీ ప్రకారం.. ఈ నోటిఫైడ్ స్పైవేర్ దాడులు నిజానికి ప్రైవేట్ కంపెనీలచే మెయింటైన్ చేసే మెర్సెనరీ స్పైవేర్ దాడులు. ఈ కంపెనీలు నిఘా పరికరాలను తయారు చేసి వాటిని ప్రభుత్వానికి విక్రయిస్తుంటాయి.
మీరు కూడా ఐఫోన్ ఉపయోగిస్తుంటే, స్పైవేర్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి:
* కంపెనీ ఏదైనా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేస్తే, మీ ఫోన్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేసుకోవాలి.
* మీ ఫోన్‌కు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.
* వీలైనంత వరకు టూ-ఫాక్టర్ అథెంటికేషన్‌ను ఉపయోగించుకోవాలి.
* తెలియని ఇమెయిల్‌లలోని అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేసే పొరపాటున కూడా చేయవద్దు.
* ఒకవేళ ఎవరైనా తెలియని వ్యక్తి మీకు WhatsAppలో ఏదైనా లింక్‌ను పంపితే, ఆ లింక్‌పై క్లిక్ చేసే పొరపాట్లు మాత్రం చేయవద్దు.
Also Read : వన్‌ప్లస్ సేన్సేషన్.. ఫోన్ డిస్‌ప్లేపై లైఫ్ టైం వారంటీ