NTR And Prashanth Neel: ఎన్టీఆర్(Junior NTR) అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి #NTRNEEL. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై మార్కెట్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. గత ఏడాది పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా, కొద్దిరోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ ఇంకా పాల్గొనలేదు కానీ, ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల, లేదా ఈ నెలాఖరున మొదలు అవ్వబోయే రెండవ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర కోసం బరువు చాలా వరకు తగ్గుతున్నాడని తెలుస్తుంది. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఊహాజనిత సిటీస్ లలో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కుతుంటాయి. కానీ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మాత్రం జరిగిన వాస్తవాలను దృష్టిలో తీసుకొని తెరకెక్కిస్తున్నారట.
1960 వ సంవత్సరం లో గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలవబడే సముద్ర తీరంలో జరిగిన మాఫియా అంశాలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ప్రశాంత్ నీల్ చిత్రాల్లో హీరోలు నెగటివ్ క్యారెక్టర్స్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ చిత్రంలో కూడా హీరో పాత్ర నెగటివ్ గానే ఉంటుందని సమాచారం. అయితే సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అనే వార్త రాగానే సోషల్ మీడియా లో ‘దేవర’ సినిమా టైటిల్ ట్రెండ్ లోకి వచ్చింది. ఎందుకంటే ‘దేవర’ చిత్రం కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమానే కాబట్టి. ఈమధ్య కాలం లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి. ‘దేవర'(Devara Movie) తర్వాత అదే సముద్రం బ్యాక్ డ్రాప్ తో విడుదలైన నాగ చైతన్య ‘తండేల్'(Thandel Movie) చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే
ఇప్పుడు ‘దేవర’ లాంటి సముద్రం బ్యాక్ డ్రాప్ తర్వాత, ఎన్టీఆర్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రశాంత్ నీల్ సినిమా కూడా అదే బ్యాక్ డ్రాప్ అవ్వడం ఆసక్తిని రేపుతున్న అంశం. మరో విశేషం ఏమిటంటే ఈ ఏడాది చివరి నుండి ఎన్టీఆర్ ‘దేవర 2′(Devara 2 Movie) లో నటించనున్నాడు. అంటే సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మరో ఎన్టీఆర్ సినిమా కూడా దగ్గర్లోనే ఉందన్నమాట. ఇలా ఎన్టీఆర్ ని సముద్రానికి పరిమితం చేసేస్తారా దర్శకులు అంటూ సోషల్ మీడియా లో ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి. ఇటీవలే డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) ఎన్టీఆర్ ని కలిసి ‘దేవర’ సీక్వెల్ ఫైనల్ డ్రాఫ్ట్ ని వినిపించాడట. ఆయనకు బాగా నచ్చడం తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టుకోమని ఆదేశించినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.