https://oktelugu.com/

Ayesha Takia : భర్త కోసం న్యాయపోరాటం చేస్తున్న ‘సూపర్’ మూవీ అయేషా టకియా..నా భర్తను వదిలేయండి అంటూ అభ్యర్థన!

Ayesha Takia : కొంతమంది హీరోయిన్లు చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ, ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ముద్రని వేసి వెళ్తుంటారు. తరాలు మారిన కూడా సోషల్ మీడియా కారణంగా వాళ్ళని మర్చిపోలేరు.

Written By: , Updated On : March 7, 2025 / 02:00 AM IST
Ayesha Takia

Ayesha Takia

Follow us on

Ayesha Takia : కొంతమంది హీరోయిన్లు చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ, ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ముద్రని వేసి వెళ్తుంటారు. తరాలు మారిన కూడా సోషల్ మీడియా కారణంగా వాళ్ళని మర్చిపోలేరు. అలా మన తెలుగు ఆడియన్స్ లో బలమైన ముద్ర వేసిన హీరోయిన్ అయేషా టకియా(Ayesha Takia). ఈమె అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ అయేషా టకియా కి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. టాలీవుడ్ లో ఆ చిత్రం తర్వాత అవకాశాలు వచ్చాయి కానీ, ఆమె ఎక్కువగా బాలీవుడ్ కి ప్రాముఖ్యం ఇచ్చింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు ఫర్హాన్ అజ్మీ అనే వ్యక్తిని పెళ్ళాడి సినిమాలకు శాశ్వతంగా దూరమైంది అయేషా టకియా.

Also Read : ఎవరు గుర్తుపట్టకుండా మారిపోయిన నాగార్జున ‘సూపర్’ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అయేషా టకియా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు అయేషా టకియా భర్త ఫర్హాన్ అజ్మీ సమస్యల్లో చిక్కుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గోవాలో ఫర్హాన్ ఒక సూపర్ మార్కెట్ ఉన్నటువంటి ప్రదేశంలో మలుపు వద్ద సిగ్నల్ ఇవ్వకుండా కారుని నడిపాడట. దీనికి గమనించిన అక్కడి స్థానికులు ఫర్హాన్ తో వివాదానికి దిగారట. గొడవ పెద్దది కావడంతో జనాలు భారీ సంఖ్యలో ఆ ప్రాంతం వద్దకు చేరుకున్నారు. దీంతో ఫర్హాన్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. అంతే కాకుండ గొడవ జరుగుతున్న సమయంలో ఫర్హాన్ తుపాకీ బయటకి తీసి బెదిరించాడని ఆయనపై ఒక ఆరోపణ ఉంది.

ఈ ఆరోపణలపై అయేషా టకియా చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది. తన దగ్గర గొడవకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని, తన భర్తని కావాలని ఈ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, త్వరలోనే ఆరోజు జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తానని, తమకు ఈ విషయం లో న్యాయం జరగాల్సిందే, అందుకోసం ఎంత దూరమైనా పోరాడుతాను అంటూ ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది అయేషా టకియా. ఈ పోస్ట్ పై సోషల్ మీడియా లో పెద్ద చర్చనే నడుస్తుంది. అయేషా టకియా భర్తకు న్యాయం చేయాలంటూ ఆమె అభిమానులు మద్దతు తెలుపుతూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర నుండి వస్తున్న వస్తున్న సమయంలో అక్కడి వారు తమను టార్గెట్ చేసారని, ఆ కాలరాత్రిని తాను మర్చిపోలేనని, అక్కడి పోలీసులు కూడా ఏకపక్షంగా వాళ్లకు మద్దతు ఇస్తూ, మాకు వ్యతిరేకించారని అయేషా వాపోయింది. మరి అయేషా చేసిన ఈ కామెంట్స్ పై అక్కడి ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో చూడాలి.

Also Read : నాగార్జున అసలు పేరేంటో తెలుసా? ఏఎన్నార్ ముద్దుగా పెట్టుకుంటే అలా మార్చుకున్నాడా?