
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్ పై చేసిన వ్యాఖ్యలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ కు విద్యుత్త్ ప్రాజెక్టులు, ఆనకట్టలు, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, సామాజిక ప్రాజెట్టులు వంటి అభివృద్ధి పథకాలు అందజేసినట్లు తెలిపారు. ఆ దేశానికి పాకిస్థాన్ చేసినదేమిటో ప్రపంచానికి తెలుసునన్నారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ మీడియాతో మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ గడ్డను పాకిస్థాన్ వ్యతిరేక కార్యకలాపాల కోసం భారత దేశం ఉపయోగించుకుంటే తమకు బాధ కలుగుతుందని చెప్పారు.