Homeక్రీడలుIND vs NZ final : ఇన్ని అవరోధాలా.. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవలేదు..

IND vs NZ final : ఇన్ని అవరోధాలా.. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవలేదు..

IND vs NZ Final : 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. టీమిండియా ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఈసారి కూడా ఫైనల్ వెళ్లి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. పూర్తి యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో అదరగొట్టింది.

దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ.. టీమిండియా ఏమాత్రం తగ్గలేదు. వరుసగా మ్యాచ్ లు గెలిచింది. వెస్టిండీస్ మీద సూపర్ 8, ఇంగ్లాండ్ మీద సెమీ ఫైనల్ లో గెలిచి సత్తా చూపించింది.

సెమి ఫైనల్లో ఇంగ్లాండ్ మీద భారీ స్కోర్ చేసినప్పటికీ.. బౌలింగ్ వైఫల్యం వల్ల కేవలం ఏడు పరుగుల తేడాతో మాత్రమే విజయం సాధించింది. ఇక టి20 వరల్డ్ కప్ లో ఆదివారం టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడుతుంది.

అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ కంటే ముందు అనేక అవరోధాలు టీమిండియాను ఇబ్బంది పడుతున్నాయి. ఇందులో ప్రధానమైనది అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. ఇతడు అంపైర్ గా సక్రమంగా విధులు నిర్వహించడం అనే ఆరోపణలు ఉన్నాయి. టీమ్ ఇండియాకు నెగిటివ్ డెఫిషియన్స్ ఇస్తుంటాడు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో ఇతడే అంపైర్ గా ఉంటున్నాడు. ఇదే మైదానంలో 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఇక ఈసారి కూడా టీమిండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను న్యూజిలాండ్ జట్టుతో ఆడుతోంది.

రికార్డుల పరంగా చూసుకుంటే గత టి20 వరల్డ్ కప్ లలో మూడు మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండ్ చేతిలో టీమ్ ఇండియా ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే 2024లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు సెమి ఫైనల్ దాకా కూడా రాలేదు. 2022 t20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్ లో ఓడిపోయింది. 2021 t20 వరల్డ్ కప్ తర్వాత దాదాపు 5 సంవత్సరాల అనంతరం న్యూజిలాండ్ ఫైనల్ వచ్చింది. ఓవరాల్ గా ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ దాకా రావడం లేదు ఎనిమిదవ సారి. భారత జట్టు ఇప్పటివరకు 15 సార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టు 14 సార్లు ఈ ఘనతనందుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు సమర్థవంతంగా ఆడుతుంది. ఆ జట్టులో ప్లేయర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు.

ఇప్పటివరకు టీమిండియా న్యూజిలాండ్ జట్టు పై ఒక టి20 వరల్డ్ కప్ మ్యాచ్ కూడా గెలవలేదు. టి20 వరల్డ్ కప్ లో భారత్ మూడుసార్లు న్యూజిలాండ్ జట్టుతో పోటీపడగా.. మూడుసార్లు కూడా ఓడిపోయింది. అయితే ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద ఇండియా గెలుస్తుందా? లేదా? అనే ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించబోతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version