IND Vs ENG (1)
IND Vs ENG: గురువారం నుంచి నాగ్ పూర్(Nagpur) వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో టీం ఇండియా తలపడునుంది. మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి స్టార్ట్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) పైనే ఉంది. మీద ఆటగాళ్ల సామర్థ్యం, ఇతర స్థానాలకు ప్లేయర్లను ఎంపిక చేయడానికి సెలక్టర్లు ఈ సిరీస్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోనున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. ఆ గెలుపు ఊపుతో టీమిండియాలో ఆత్మవిశ్వాసం తొణిక సలాడుతోంది. దాదాపు 14 నెలల విరామం తర్వాత టీమిండియా స్వదేశంలో 50 ఓవర్ల ఫార్మాట్ లో బరిలోకి దిగుతోంది. ఇటీవల టెస్ట్ సిరీస్లలో టీమిండియా దారుణంగా విఫలమైంది. ఈ క్రమంలో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ పూర్వపు ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. స్వదేశం వేదికగా 2023 లో జరిగిన వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ 765, రోహిత్ శర్మ 597 పరుగులతో అదరగొట్టారు. అయితే ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో సగటు భారతీయ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక గత ఏడాది శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా 0-2 తేడాతో ట్రోఫీని కోల్పోయింది.. ఆ సిరీస్లో విరాట్ కోహ్లీ ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్ శర్మ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. కోహ్లీ అదే దారుణమైన ఆట తీరును గత మూడు నెలలుగా కొనసాగిస్తున్నాడు. వీరిద్దరి కెరియర్ చరమాంకంలో ఉన్న నేపథ్యంలో.. ఇంగ్లాండ్ సిరీస్ చక్కటి అవకాశం. ఇందులో గనుక వారు తమ పూర్వపు అందుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ లో మెరుగైన ఆట తీరు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది.
భారత జట్టు అంచనా ఇలా
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, రాహుల్/ రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్/ అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, మహమ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్.
ఇంగ్లాండ్ జట్టు అంచనా ఇలా
జోష్ బట్లర్ (కెప్టెన్/ వికెట్ కీపర్), లివింగ్ స్టోన్, బ్రెండన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, బెథల్, రషీద్, షాకీబ్ మహమూద్, డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్.
మైదానం ఎలా ఉందంటే
ఈ మైదానం స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగని బ్యాటింగ్ కు ఇబ్బందని కాదు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు 288 పరుగులు. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత ఇక్కడ వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడి వాతావరణం పొడిగా ఉంది. వర్షం ముప్పు లేదు. బంతిపై పట్టు సాధిస్తే పేస్ బౌలర్లు కూడా వికెట్లు తీయవచ్చని క్యూరేటర్ చెబుతున్నాడు. స్పిన్ బౌలర్లు మాత్రం మాయాజాలం ప్రదర్శిస్తే బ్యాటర్ లకు ఇబ్బందేనని తెలుస్తోంది.
ప్రత్యక్ష ప్రసారం
టీవీ/ ఓటిటి/ వెబ్ సైట్: స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, డిస్నీ ప్లస్ హాట్ స్టార్.