HomeNewsPawan Kalyan Chandrababu: పవన్ తో చంద్రబాబు కలిస్తే.. మరి బీజేపీ పరిస్థితేంటి?

Pawan Kalyan Chandrababu: పవన్ తో చంద్రబాబు కలిస్తే.. మరి బీజేపీ పరిస్థితేంటి?

Pawan Kalyan Chandrababu: 2024కు ఏపీ రాజకీయం ఎలా ఉంటుందో అస్సలు ఊహించని విధంగా మారింది. పొత్తుల ఎత్తుల్లో ఎవరు ఎవరితో కలుస్తారో ఊహకందడం లేదు.. పవన్ పై చంద్రబాబ ప్రేమ.. బీజేపీకి శాపంగా మారుతుందా? జనసేన-బీజేపీ మిత్రత్వం చంద్రబాబు వల్ల శత్రుత్వానికి దారితీస్తుందా? వాళ్లిద్దరి పవిత్రబంధంలో చంద్రబాబు పుల్లలు పెడుతాడా? ఇప్పుడు ఇవే భయాలు ఏపీ బీజేపీలో వెంటాడుతున్నాయట.. చంద్రబాబు పొత్తుల ఎత్తుల్లో తమ అడ్రస్ ఎక్కడ గల్లంతవుతుందన్న ఆందోళన బీజేపీ నేతలను వెంటాడుతోందట.. ఇప్పటికే సోము వీర్రాజు ఈ మధ్య పవన్ పై కామెంట్ చేయడం.. ఇప్పుడు చంద్రబాబు అదే పవన్ పై ప్రేమ కురిపించడంతో ఎవరి బంధాలు ఎవరితో కలుస్తాయోనన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు ఆఫర్ ఏపీ బీజేపీని కలవరపెడుతోంది.

Pawan Kalyan Chandrababu
Pawan Kalyan Chandrababu

రాజ‌కీయాల్లో గండ‌ర గండుడు అయిన చంద్ర‌బాబు.. ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. ఇప్ప‌టికే వ‌రుస ఎన్నిక‌ల్లో దారుణ‌మైన ఓట‌మిని చ‌వి చూశాడు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో పొత్తుల‌తోనే పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇందుకోసం ఎప్ప‌టి నుంచో బీజేపీతో క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. ఆ పార్టీ మాత్రం ఆయ‌న్ను ఇన్ని రోజులుగా దూరం పెట్టేస్తోంది. దీంతో ఆయ‌న జ‌న‌సేన వైపు చూస్తున్నారు. ప‌వ‌న్ కూడా పాత మిత్రుడే కాబ‌ట్టి త‌న ప్ర‌పోజ‌ల్‌కు కాద‌న‌బోర‌నేది చంద్ర‌బాబు ప్లాన్‌. కానీ ప‌వ‌న్ తో ఆల్రెడీ బీజేపీ పొత్తులో ఉంది. మ‌రి ప‌వ‌న్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ప‌రిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తెర‌మీద‌కు వ‌స్తున్న చర్చ‌.

కాగా పొత్తుల‌పై చంద్ర‌బాబు కుప్పంలో క్లారిటీ ఇచ్చేశారు. ప‌వ‌న్ మీద త‌నుకు ప్రేమ ఉంటే స‌రిపోద‌ని, ప‌వ‌న్ కు కూడా త‌న మీద ప్రేమ ఉండాలి క‌దా అన్న‌ట్టు చెప్పేశారు. అంటే పొత్తుకు టీడ‌పీ సిద్ధంగా ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పేశార‌న్న మాట‌. అయితే గ‌తంలో కూడా ప‌వ‌న్ తో దోస్తీని వ‌దులుకోవాల‌ని చంద్ర‌బాబు అనుకోలేదు. శ్రీరెడ్డి లాంటి వారితో టీడీపీ నేత‌లే త‌న మీద తిట్టిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో ప‌వ‌న్ దూరం అయ్యారు.

Also Read: పార్టీలకు అనుకూలంగా పక్కదారి పడుతున్న మీడియా సిద్ధాంతాలు?

ఆ త‌ర్వాత ఆయ‌న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ చంద్ర‌బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న త‌లుచుకుంటే.. శ‌త్రువును కూడా మిత్రుడిని చేసుకోగ‌ల‌ర‌ని ఆయ‌న రాజ‌కీయ చ‌రిత్రే చెబుతోంది. కాబ‌ట్టి ఏ క్ష‌ణంలో ప‌వ‌న్‌ను ఆయ‌న లాగేసుకుంటారో అనే భ‌యం ఏపీ బీజేపీలో స్ప‌ష్టంగా కనిపిస్తోంది. దీంతో చంద్ర‌బాబు మీద విమ‌ర్శ‌లు స్టార్ట్ చేశారు సోము వీర్రాజు. చంద్ర‌బాబు అవ‌సరానికి ఎవ‌రినైనా ద‌గ్గ‌ర‌కు తీసుకుంటార‌నే సెటైర్లు పేల్చుతున్నారు. కానీ ఈ అంశాల‌పై అటు ప‌వ‌న్ గానీ, జ‌న‌సేన నేత‌లు గానీ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ట్లేదు. మ‌రి బీజేపీకి ఎందుకింత టెన్ష‌న్ అంటే.. ఇప్పుడు ప‌వ‌న్ వ‌ల్లే అంతో ఇంతో త‌మ పార్టీకి ప్రాధాన్య‌త పెరుగుతోంది కాబ‌ట్టి.. ప‌వ‌న్ దూరం అయితే త‌మ ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు వారిలో ఉన్న టెన్ష‌న్‌.

Also Read: పవన్ కళ్యాణ్ తో పొత్తు లేకుండా చంద్రబాబు గెలవగలడా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version