Irrfan Khan: ఇర్ఫాన్ ఖాన్ నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. నేడు ఆ దివంగత లెజెండరీ నటుడి జయంతి. ఈ సందర్భంగా ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సిక్దర్ ప్రేక్షకుల చేత కూడా కన్నీళ్లు పెట్టించారు. ఆమె భావోద్వేగానికి గురైతే ప్రేక్షకులు కూడా తాము భావోద్వేగానికి గురి అయినట్లు ఫీల్ అవుతున్నారు. సుతాపా సిక్దర్ ఇర్ఫాన్ తో గడిపిన క్షణాన్ని, ఆయనతో పంచుకున్న జీవితాన్ని తరుచూ సోషల్ మీడియాలో మెసేజ్ రూపంలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటారు.

Also Read: సంక్రాంతి జాతరలో పోటీ పడే చిత్రాలివే !
తాజాగా ఆమె మరెన్నో జ్ఞాపకాలను నెటిజన్లతో పంచుకున్నారు. తన భర్త ఇర్ఫాన్ ఖాన్ చనిపోవడానికి ముందు రోజురాత్రి, తన జీవితంలో మర్చిపోలేని రోజు అని ఆమె చెప్పారు. ఆ రోజు రాత్రి ఆమె ఇర్ఫాన్ ఖాన్ కి ఇష్టమైన పాటల్ని పాడుతూ.. ఆయన ఎదుటే కూర్చుని బాధగా చూస్తూ ఉందట. ఆమె నోటి వెంట పాట వింటూ.. అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ మాత్రం తన కళ్ల నుంచి కన్నీళ్లను కారుస్తూనే ఉన్నాడట.
నిజంగా ఇర్ఫాన్ ఖాన్ ఎంత బాధ అనుభవించి ఉంటాడు ?. ఇర్ఫాన్ ఖాన్ ఓ గొప్ప నటుడు. ఓ గొప్ప భర్త, అలాగే తండ్రి కూడా. అలాంటి అతను తమ జీవితాల్లో నుంచి సడెన్ గా వెళ్లిపోయేసరికి తాము ఎంతగానో బాధ పడ్డామని సుతాపా సిక్దర్ చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29, 2020న ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసినా.. ఆయన నటించిన పాత్రలు, అలాగే ఆయన ఎప్పటికీ ప్రేక్షకుల మదిలోనే శాశ్వతంగా ఉంటారు.
Also Read: మహేష్ కోసం ఫ్యాన్స్ పూజలు, హోమాలు.. వైరల్..!