
హైదరాబాద్ నగరంలో ప్రజలు దీపావళి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, ఇందులో భాగంగా భారీ శబ్దాలు చేసే బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 12 ఉదయం 6 గంటల నుంచి 16 వ తేదీ సాయంత్రం వరకు ఈ ఉత్తర్వులు వర్తిసాయని తెలిపారు. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన పరిమాణంలోనే శబ్దం వచ్చే క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సూచించారు. మెయిన్‌రోడ్లు, పబ్లిక్ ఏరియాల్లో పటాకలు కాల్చవద్దన్నారు.