
ఈనెల 24న ‘జగనన్న తోడు’ పథకానికి శ్రీకారం చుట్టాలని ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం నిర్ణయించింది. గురువారం జరిగిన ఈ సమావేశంలో చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సున్నా వడ్డి కింద 10 వేల రూపాయల రుణ సదుపాయం కల్పించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ఇసుక రిచ్‌లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. పేరుగాంచిన ప్రైవేట్ సంస్థలకు అప్పగించి టెండర్ ద్వారా ప్రక్రియ చేపట్టాలంది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ సహా జూదాల కట్టడి బాధ్యతలను ఎస్‌ఈబీ పరిధిలోకి తేవాలని సూచించింది. అలాగే డ్రగ్స్, గంజాయి నిరోధించే బాధ్యతలూ కూడా వీటికే అప్పగించాలనే నిర్ణయించింది.