Shikhar Dhawan : శిఖర్ దావన్, రోహిత్ శర్మతో కలిసి 18 సెంచరీ భాగస్వామ్యాలను నిర్మించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో గొప్ప ఓపెనింగ్ జోడీలుగా శిఖర్, రోహిత్ నిలిచారు. టెస్ట్ క్రికెట్లో మొదటి ఇన్నింగ్స్ లో 187 రన్స్ చేసి దావన్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన మ్యాచ్ లో 85 బంతుల్లోనే సెంచరీ చేశాడు. భారత జట్టులో టెస్టుల్లో ఆరంగేట్ర ఆటగాడు చేసిన స్కోర్ ఇదే అత్యధికం. మొత్తం మీద భారత జట్టులో ఇది ఎనిమిదవ అత్యుత్తమ ఇన్నింగ్స్. వన్డేలలో 164 ఇన్నింగ్స్ లలో 91.35 స్ట్రైక్ రేట్ , 44.11 సగటుతో 6,793 పరుగులు చేశాడు. మూడు వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన 19 భారతీయ బ్యాటర్లలో శిఖర్ ఒకడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్, సచిన్ మాత్రమే ఎక్కువ సగటును కలిగి ఉన్నారు.
ఐసీసీ నిర్వహించిన టోర్నమెంట్ లలో (వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) 20 ఇన్నింగ్స్ లలో అతడేకంగా ఆరు సెంచరీలు చేశాడు.. ఈ టోర్నీలలో 1000 పరుగులు చేసిన 51 మంది బ్యాటర్ల కంటే ధావన్ సగటు అత్యుత్తమ.. ప్రపంచ కప్ లలో ధావన్ సగటు 53.70, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లలో అతడి సగటు 77.88.
రోహిత్ తో కలిసి ధావన్ వన్డేలలో మొదటి వికెట్ కు 18 సెంచరీ భాగస్వామ్యాలు నిర్మించాడు. సౌరవ్ గంగూలీ – సచిన్ టెండుల్కర్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు..
రోహిత్ – శిఖర్ పలు మ్యాచ్ లలో ఓపెనింగ్ జోడీలుగా వచ్చి 5,148 పరుగులు చేశారు. అన్ని ఓపెనింగ్ జోడీలలో నాలుగవ అత్యుత్తమ ఆటగాళ్లుగా నిలిచారు.. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ – సౌరవ్ గంగూలీ, ఆడం గిల్ క్రిస్ట్ – మాథ్యూ హెడెన్, గోర్డాన్ గ్రీనిడ్జ్ – డెస్మండ్ హేన్స్ మిగతా స్థానంలో ఉన్నారు..
వన్డేలలో 6000 పరుగులు పూర్తి చేయడానికి శిఖర్ ధావన్ 140 ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ మైలురాయిని అందుకోవడానికి తక్కువ ఇన్నింగ్స్ ఆడిన ఆటగాళ్లలో ఆశమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ, కెన్ విలియంసన్, డేవిడ్ వార్నర్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు..
తన 100వ మ్యాచ్లో సెంచరీ చేసి శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు. 100 మ్యాచ్లో సెంచరీలు చేసిన పదిమంది ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. 2018లో జోహెన్నెస్ బర్గ్ లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు 109 పరుగులు చేశాడు.
శిఖర్ ధావన్ టెస్ట్ సగటు 61. 24 ఇన్నింగ్స్ లు ఆడిన అతడు ఆరు సెంచరీలు కొట్టాడు.. 1403 రన్స్ చేశాడు.. ఉపఖండం వెలుపల 34 ఇన్నింగ్స్ లు ఆడి, ఒక సెంచరీ చేశాడు. 26.82 సగటుతో 912 రన్స్ మాత్రమే చేశాడు.
భారత్ బయట ఆడిన మ్యాచ్లలో 12 సెంచరీలు చేశాడు శిఖర్.. ఉపఖండం వెలుపల అద్భుతమైన వన్డే రికార్డు కలిగి ఉన్నాడు. 89.34 స్ట్రైక్ రేట్, 44.03 సగటు ను కొనసాగించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లపై మెరుగైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఈ నాలుగు జట్లపై 68 ఇన్నింగ్స్ లు ఆడి, 8 సెంచరీలు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో శిఖర్ ధావన్ 6,769 రన్స్ చేశాడు. కోహ్లీ ఏకంగా 8,004 రన్స్ చేశాడు. కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా ధావన్ కొనసాగుతున్నాడు. 768 ఫోర్లు కొట్టి.. ఏ ఆటగాడికి కూడా సాధ్యం కాని రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. కోహ్లీ ఈ జాబితాలో 705 బౌండరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ 2012, 2016, 2019, 2020, 2021 సీజన్లలో ధావన్ 500కు మించి పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, వార్నర్ 7 సార్లు, కేఎల్ రాహుల్ ఆరు సార్లు ఈ ఘనతను సాధించారు. 2018లో ధావన్ 497 పరుగులు చేశాడు. అరుదైన మైలురాయిని మూడు పరుగుల తేడాతో కోల్పోయాడు.