టాలీవుడ్ లో ఉన్న ప్రొడక్షన్స్ లో అతి పెద్ద ప్రొడక్షన్ లో ఒకటి సురేష్ ప్రొడక్షన్ ఎంతోమంది హీరోస్ కి హిట్స్ ను అందించారు సురేష్ ప్రొడక్షన్స్. వెంకటేష్ నటించిన నారప్ప ఇటీవల ఓటిటి లో విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా తమిళ్ అంత రేంజ్లో హిట్ కాకపోయినా తెలుగులో కూడా మంచి టాక్ వచ్చింది ,ఇదే సురేష్ ప్రొడక్షన్స్ వారికి ప్రాఫిటబుల్ వెంచర్ అయింది.
ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన వెంకటేష్ దృశ్యం 2, రానా విరాట పర్వం ఈ రెండు సినిమాలు థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా సందిగ్ధతతో ఉన్నారు సురేష్ బాబు. ఈ రెండు చిత్రాలను ఓటిటి విడుదల చేయాలా లేక థియేటర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ కోసం మంచి రేట్ ఆఫర్ చేశారట. ఈ ఆఫర్ కు సురేశ్ బాబు ఓకే చెప్పాల లేదా ఈ రెండు చిత్రాలను థియేటర్స్ లోనే విడుదల చేస్తే బాగుంటుందని అనుకున్నారట.ఈ సినిమాల్ని ఏ డేట్ లో విడుదల చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు లో ఉన్నారు. చిన్న సినిమాలు సైతం విడుదల తేదీలు ఫిక్స్ చేసుకుంటున్నాయి.కానీ ఈ బాబాయ్ కొడుకుల సినిమాలకి సరైన రిలీజ్ డేట్ సెట్ అవడం లేదు.సురేశ్ బాబు ఈ రెండు చిత్రాలను ఏ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయనున్నారు చూడాలి మరి.