కరోనా మహమ్మరి అగ్రరాజ్యాలకు సైతం వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా కరోనా దాటికి విలవిలలాడిపోతుంది. ఇటలీ, స్పెయిన్, బ్రిటిన్ దేశాలు కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో లక్షకుపైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా సోకి ప్రముఖ హాలీవుడ్ నటి మృతిచెందడం శోచనీయంగా మారింది. బ్రిటన్ కు చెందిన హిల్లరి హీత్(61) శనివారం మృతిచెందడంతో హాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. నటి మరణవార్తను ఆమె దత్త పుత్రుడు అలెక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
హాలీవుడ్ నటి హిల్లరీ హీత్ కు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి మృతిచెందినట్లు తెలుస్తోంది. కాగా బ్రిటిష్‌కు చెందిన హిల్లరీ ముఖేల్ రీవ్స్ హర్రర్ చిత్రం ‘విచ్ ఫైండర్ జనరల్’తో నటిగా పరిచయమైంది. పలు విజయవంతమైన హాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కరోనాతో ఆమె మృతిచెందడంతో చిత్రపరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా మృతిచెందారు. ఆమెపై మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.