IND VS PAK : ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసేవాళ్ల కోసం వచ్చిన 10 కొత్త ఫీచర్స్ ఇవే…

ఇక ఇలాంటి కొత్త ఫీచర్స్ తో ఈరోజు జరిగే మ్యాచ్ ని చూడటానికి అభిమానులు అంతా రెఢీ అవుతున్నారు...

Written By: NARESH, Updated On : October 14, 2023 12:46 pm
Follow us on

IND VS PAK : 2023 వరల్డ్ కప్ లో ఆడుతున్న మ్యాచ్ లు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక అందులో భాగం గానే ఇవాళ్ళ ఇండియా, పాకిస్తాన్ టీమ్ ల మధ్య ఒక భారీ మ్యాచ్ అనేది జరగనుంది.ఇక ఈ మ్యాచ్ ని టివిలో గానీ, టాబ్స్ లో గానీ, లాప్ టాప్స్ లో గానీ చూసే ఆడియెన్స్ కోసం 10 కొత్త ఫీచర్స్ ని అందించడం జరిగింది. అవి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇక మొదట గా ఈ మ్యాచ్ ని మొబైల్స్ లో చూసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండే విధంగా డిస్నీ+ హాట్‌స్టార్ మ్యాక్స్ వ్యూ వాళ్లతో కలిసి మ్యాచ్ చూసే వాళ్ళకి వన్-హ్యాండ్ లో చూడటం కోసం నిలువుగా స్ట్రీమింగ్ అయ్యే విధంగా గా కూడా ఒక ఫీచర్ ని దీనిలో ఆడ్ చేయడం జరిగింది.

మనం మ్యాచ్ చూస్తున్న టైం లో లైవ్ స్కోర్ బోర్డ్ ని చూడటానికి కూడా అందుబాటు లో ఉండే విధంగా ఒక ఫీచర్ ని తీసుకురావడం జరిగింది.దీని ద్వారా నిలువుగా మ్యాచ్ చూస్తూనే స్కోర్ బోర్డ్ కి సంభందించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఒకేసారి నిలువుగా అందుబాటు లో ఉంటుంది…

మ్యాచ్ ని మనం హైక్వాలిటీ పిక్చర్ లో చూసిన కూడా దానికి సంభందించిన డేటా వినియోగం అనేది మామూలు రేంజ్ లోనే వినియోగం అవుతుంది…

మనం లైవ్ లో మ్యాచ్ ని చూడలేకపోతే మనకు మ్యాచ్ కి సంభందించిన అప్డేట్ స్కోర్ బోర్డ్ అనేది అప్ నుంచి మనకు డైరెక్ట్ గా మెసేజ్ ల రూపం లో మొబైల్ కి రావడం జరుగుతుంది.దీనికోసమే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొత్త ఆల్వేస్ అనే స్కోర్ బోర్డ్ ని కలిగి ఉంది..

అలాగే వినియోగదారులకు వాళ్ల ఇష్టం వచ్చిన కెమెరా యాంగిల్ లో మ్యాచ్ ని చూడటానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనేది అందిస్తుంది. బర్డ్ ఐ వ్యూ నుంచి అయిన లేదా బ్యాట్స్ మెన్స్ ఎండ్ నుంచి అయిన కూడా గేమ్ ని చూసే సౌకర్యాన్ని కలిగిస్తుంది…

ఇక అలాగే మరో కామెంటేటర్ కూడా వచ్చి మ్యాచ్ కి సంభందించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి అవకాశం ఉంది.దానితో పాటు ఏ ఆటగాడు ఎలాంటి స్కోర్ బోర్డ్ ని కలిగి ఉన్నాడు లాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు…

ఒక కామెంటేటరీ మాట్లాడే భాష ని కూడా మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.దాని ద్వారా మనకు నచ్చిన లాంగ్వేజ్ లో మ్యాచ్ ని చూడవచ్చు…
డిటిహెచ్ ద్వారా స్టార్ స్పోర్ట్స్ లో మ్యాచ్ కనక చూసిన కూడా భాషని మార్చుకోవచ్చు…

డిటిహెచ్ ప్రొవైడర్లకు కూడా వాళ్ళకి నచ్చిన యాంగిల్ లో మ్యాచ్ చూడటానికి కానీ హైలెట్స్ చూడటానికి కానీ అవసరమైన ఫీచర్స్ ని కూడా ఇందులో అందించడం జరిగింది…

కొన్ని డిటిహెచ్ లలో మ్యాచ్ చూస్తున్నప్పుడు మ్యాచ్ ని పాజ్ చేసి స్నాక్స్ లాంటివి తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి ఫీచర్స్ ని వాడుకుంటూ మ్యాచ్ ని పాజ్ చేసుకొని మళ్ళీ చూడటానికి ఈ ఫీచర్ అనేది ఉపయోగపడుతుంది…

ఇక ఇలాంటి కొత్త ఫీచర్స్ తో ఈరోజు జరిగే మ్యాచ్ ని చూడటానికి అభిమానులు అంతా రెఢీ అవుతున్నారు…