Indian Railways:ప్రస్తుత కాలంలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యమనే సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత బీమా పాలసీలను తీసుకునే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఇన్సూరెన్స్ పాలసీలు కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయి. హెల్త్ పాలసీలను తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అయితే రైలు ప్రయాణాలు చేసేవాళ్లకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉంది.
మనలో చాలామంది ఆన్ లైన్ ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేస్తారు. అయితే ట్రైన్ టికెట్ బుకింగ్ చేసే సమయంలో ఇన్సూరన్స్ కు సంబంధించిన ఆప్షన్ ను ఎంచుకుని టికెట్ రేటు కంటే అదనంగా 35 పైసలు చెల్లిస్తే సరిపోతుంది. రైలు ప్రయాణంలో ప్రయాణికుడు మరణించినా ప్రయాణికుడికి ఏదైనా ప్రమాదం జరిగినా ఈ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఆస్పత్రి ఖర్చులకు కూడా ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.
Also Read: ఏపీలో 1317 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. మంచి జీతంతో?
రైలు ప్రమాదంలో ప్రయాణికుడికి గాయాలు అయితే 2 లక్షల రూపాయల వరకు బీమా డబ్బులు వస్తాయి. ప్రయాణికుడికి శాశ్వత వైకల్యం సంభవిస్తే పది లక్షల రూపాయలు, శాశ్వత పాక్షిక అంగవైకల్యానికి 7.5 లక్షల రూపాయల కవరేజీ లభిస్తుంది. టికెట్ తో పాటు ఇన్సూరెన్స్ కు డబ్బులు చెల్లిస్తే రిజిస్ట్రర్డ్ ఈమెయిల్ ఐడీకి ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన డబ్బులు వస్తాయి.
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆర్థికపరమైన బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా ఈ పాలసీలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు.