Grain purchases: కేంద్రప్రభుత్వం ధాన్యం కొనడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రోడ్డెక్కారు. పార్లమెంట్ లోనూ ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఆందోళనలు చేసేంత సీన్ టీఆర్ఎస్ కు లేదని.. ఇదివరకే కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నామని కేంద్రప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పార్లమెంట్ సాక్షిగా కడిగేసింది. అసలు రాజకీయంగా లబ్ధి పొందడానికే కేసీఆర్, ఎంపీలు ఈ నాటకాలు ఆడుతున్నారని తాజాగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ సర్కార్ ఇరుకునపడ్డట్టు అయ్యింది.
రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అడిగిన ప్రశ్నకు పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. అసలు ధాన్యంను కేంద్రం కొనడం లేదన్నది అవాస్తవం అని పీయూష్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడానని.. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పుకొచ్చారు.
ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల టన్ను ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా 32.66 లక్షల టన్నులే ఇచ్చిందని.. ఎంవోయూకు కట్టుబడి ఉండని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొనడం లేదని ఆందోళన చేయడం ఏంటని పీయూష్ గోయల్ ప్రశ్నించారు. తెలంగాణ అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉందని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు.
Also Read: మోడీ అంటే ఎందుకంత భయం?
తెలంగాణలో బాయిల్డ్ రైస్ 44లక్షల టన్నులు కొంటామని ఒప్పందం చేసుకుంటే.. కేవలం ఇప్పటివరకూ 27లక్షల టన్నులు మాత్రమే ఇచ్చారని.. 17 లక్షలు ఇవ్వలేదని తెలంగాణ తీరును కేంద్రం కడిగేసింది.
ఈ క్రమంలోనే వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ రాజకీయంగా లబ్ధి పొందడానికి నెపం బీజేపీపై వేయడానికి చూస్తోందని పార్లమెంట్ సాక్షిగా అర్థమైంది. పెండింగ్ ధాన్యం పంపకుండా భవిష్యత్తు గురించి టీఆర్ఎస్ ఆందోళన చేయడం పక్కా ప్లాన్ అని తేటతెల్లమైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తప్పు టీఆర్ఎస్ సర్కార్ దేనని మరోసారి స్పష్టమైంది.
Also Read: తెలంగాణలో ఈసారి పంటల పరిస్థితి ఏం కానుంది? ఏం వేయాలి?