ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ శాఖలో పది అర్హతతో ఉద్యోగ ఖాళీలు?

ఏపీ పోస్టల్ సర్కిల్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పోర్ట్స్ కోటాలో 75 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలతో పాటు సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్ ఉద్యోగ […]

Written By: Navya, Updated On : November 4, 2021 2:03 pm
Follow us on

ఏపీ పోస్టల్ సర్కిల్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పోర్ట్స్ కోటాలో 75 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలతో పాటు సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 12 తరగతి పాస్ కావడంతో పాటు తెలుగుపై నాలెడ్జ్ ఉన్నవాళ్లు, పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్ట్ గా ఎంచుకున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 25,000 రూపాయల నుంచి 81,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుందని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://dopsportsrecruitment.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.