Unstoppable with NBK: చిరంజీవి గురించి మోహన్​బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా ఆహా ఓటీటీ ప్లాట్​ఫామ్​లో గురువారం తొలి ఎపిసోడ్​ విడుదలైంది. ఇందులో మోహన్​ బాబు తొలి గెస్ట్​గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే బాలయ్య అడిగిన ప్రశ్నలకు మోహన్​బాబు తనదైన స్టైల్​లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  అంతే కాదు, బాలకృష్ణకు మోహన్​బాబు ఎదురు ప్రశ్నలు సంధించి సమాధానాలూ రాబట్టారు. ఇలా ఎంతో రసవత్తరంగా మారిన ఆ విశేషాలేంటో చూద్దాం. షోలో భాగంగా చిరంజీవిపై మీకున్న అభిప్రాయం ఏంటని బాలయ్య ఆడగ్గా.. […]

Written By: Raghava Rao Gara, Updated On : November 4, 2021 2:08 pm
Follow us on

Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా ఆహా ఓటీటీ ప్లాట్​ఫామ్​లో గురువారం తొలి ఎపిసోడ్​ విడుదలైంది. ఇందులో మోహన్​ బాబు తొలి గెస్ట్​గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే బాలయ్య అడిగిన ప్రశ్నలకు మోహన్​బాబు తనదైన స్టైల్​లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  అంతే కాదు, బాలకృష్ణకు మోహన్​బాబు ఎదురు ప్రశ్నలు సంధించి సమాధానాలూ రాబట్టారు. ఇలా ఎంతో రసవత్తరంగా మారిన ఆ విశేషాలేంటో చూద్దాం.

షోలో భాగంగా చిరంజీవిపై మీకున్న అభిప్రాయం ఏంటని బాలయ్య ఆడగ్గా.. అతను చాలా మంచి నటుడని, అద్భతంగా డాన్స్​ చేస్తాడని మోహన్​బాబు అన్నారు. వ్యక్తిగతంగా చిరుపై తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదని అన్నారు. ఆయనతోకలిసి ఎన్నో సినిమాల్లో నటించినట్లు పేర్కొన్నారు. చిరంజీవి భార్య సురేఖ తనకు సోదరిలాంటిదని మోహన్​ బాబు అన్నారు.

కాగా, మీరు నటించిన సినిమాల్లో అసలు చూసుకోలేని సినిమా ఏదైనా ఉందా అని బాలకృష్ణ అడగ్గా.. పటాలం పాండు చేసినప్పుడు తన భార్య నిర్మల వారం రోజులు మాట్లాడలేదని అన్నారు. తన బ్యానర్​లో వరుసగా 5సినిమాలు ఫ్లాప్​ అవ్వగా.. మహాబలిపురంలోని భూములు అమ్మి అందరికీ అప్పులు చెల్లించినట్లు తెలిపారు. ఒకానొక సమయంలో సర్గీయ ఎన్టీఆర్​ని అన్నయ్యా మీతో కలిసి సినిమా చేస్తా అని అడిగినప్పుడు.. రాజకీయాల్లో ఫెయిల్​ అయ్యాను. నా సినిమాలు ఎవరు చూస్తారు. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు అని సలహా ఇచ్చిన గొప్ప మనిషి ఎన్టీఆర్​ అని మోహన్​ బాబు చెప్పుకొచ్చారు.