ఏటీఎం పిన్ మర్చిపోయిన వారికి అలర్ట్.. ఎస్బీఐ సరికొత్త ఫీచర్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఏటీఎం పిన్ ను ఎవరైనా మరిచిపోతే సులభంగా కొత్త పిన్ ను జనరేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కొత్తకొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుస్తున్న ఎస్బీఐ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎం పిన్ మరిచిపోతే ఇంటి దగ్గరి నుంచే సులభంగా కొత్త పిన్ ను జనరేట్ […]

Written By: Navya, Updated On : February 22, 2021 2:11 pm
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఏటీఎం పిన్ ను ఎవరైనా మరిచిపోతే సులభంగా కొత్త పిన్ ను జనరేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కొత్తకొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుస్తున్న ఎస్బీఐ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎం పిన్ మరిచిపోతే ఇంటి దగ్గరి నుంచే సులభంగా కొత్త పిన్ ను జనరేట్ చేసుకోవచ్చు. 1800 112 211 లేదా 1800 425 3800 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా పిన్ ను జనరేట్ చేసుకునే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది. ఇప్పటికే ఎస్బీఐ ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం పిన్ ను మార్చుకునే అవకాశం ఉండగా ఇకపై రిజిస్టర్ మొబైల్ నంబర్ సహాయంతో కూడా పిన్ ను జనరేట్ చేసుకోవచ్చు.

ఎస్బీఐ ఖాతాదారులు పిన్ ను జనరేట్ చేసుకోవాలంటే మొదట 1800 112 211 లేదా 1800 425 3800 నంబర్లకు కాల్ చేసి ఆప్షన్ 6 ను పిన్ జనరేట్ కోసం ఎంచుకోవాలి. ఆ తరువాత ఎస్బీఐ డెబిట్ కార్డ్ నంబర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డ్ ఎక్స్ పైరీ డేట్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రిజిస్టర్ మొబైల్ లేదా మెయిల్ ఐడీకి వచ్చే ఆరు అంకెల వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత నాలుగు అంకెల పిన్ నంబర్ ను ఎంచుకోవడంతో పాటు మరోసారి పిన్ నంబర్ ను ఎంటర్ చేసి రీ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పిన్ జనరేట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. ఎస్బీఐ ఖాతాదారులు ఈ విధంగా సులభంగా పిన్ ను జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.