Genelia interview: మన చిన్నతనం లో ఎంతో ఇష్టపడిన హీరోయిన్స్ లో ఒకరు జెనీలియా(Genelia Deshmukh). అందం తో పాటు ఆమె అద్భుతమైన అభినయాన్ని చూసి ఆమెని అభిమానించని వారంటూ ఎవ్వరూ ఉండరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈమెకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. మహేష్ బాబు(Superstar Mahesh Babu), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ప్రభాస్(Rebel Star Prabhas) లతో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో ఈమె సినిమాలు చేసింది. తెలుగు లో ఈమె చివరగా కనిపించిన చిత్రం ‘ఆరెంజ్’. రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అంతకు ముందే ఆమె టాలీవుడ్ లో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. ఆ తర్వాత రితేష్ దేశముఖ్ ని ప్రేమించి పెళ్ళాడి సినిమాలకు కొంతకాలం దూరం అయ్యింది.
ఇద్దరు పిల్లలకు తల్లై పెరిగి పెద్దయ్యాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ లో సెలెక్టివ్ గా క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని నేటి తరం ఆడియన్స్ లో కూడా మంచి మార్కులు కొట్టేసింది. కానీ మన తెలుగు లో ఈమె సినిమా చేసి చాలా కాలమే అయ్యింది. ఆరెంజ్ తర్వాత మళ్ళీ ఆమె ‘జూనియర్’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో జెనీలియా కూడా చురుగ్గా పాల్గొంటుంది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడిన కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అదే సమయం లో ప్రభాస్ అభిమానులను కూడా కాస్త ఆమె మాటలు నొచ్చుకునేలా చేశాయి.
Also Read: Simbu Virat Kohli Issue: స్టార్ హీరోని దారుణంగా అవమానించిన కోహ్లీ..ఇంత అన్యాయమా!
ఆమె మాట్లాడుతూ ‘నాతో కలిసి నటించిన రామ్ చరణ్,అల్లు అర్జున్, ఎన్టీఆర్ నేడు ఈ స్థాయిలో ఉండడం చూసి నాకెంత గర్వం గా అనిపిస్తుంది. #RRR లో ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan) ఎంతో అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి దొరికిన ఒక వరం లాంటి వాడు. రామ్ చరణ్ కూడా అద్భుతమైన నటుడు. వీళ్లంతా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న స్టార్ స్టేటస్ కి అన్ని విధాలుగా అర్హులు’ అంటూ చెప్పుకొచ్చింది. పాన్ ఇండియన్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్(Icon Star Allu Arjun), రామ్ చరణ్ గురించి మాట్లాడింది కానీ, మరో పాన్ ఇండియన్ హీరో అయిన ప్రభాస్ గురించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రభాస్ అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ కేవలం ఆమె తనతో పని చేసిన హీరోల గురించి మాత్రమే మాట్లాడిందని, అందుకే ప్రభాస్ ప్రస్తావన రాలేదేమో అని సోషల్ మీడియాలో మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.