https://oktelugu.com/

పంత్ కు అండగా గంగూలీ

టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అండగా నిలిచారు. ప్రస్తుతం నిబంధనలు మారాయని తెలిపారు. నిజ జీవితంలో పూర్తిగా మాస్కులు ధరించడం కష్టమని వెల్లడించారు. ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న రిషబ్ పంత్ కు డెల్టా వేరియంట్ సోకడం గురువారం సంచలనం సృష్టించింది. అయితే పంత్ కు పాజిటివ్ వచ్చి ఎనిమిది రోజులైందని, ప్రస్తుతం లక్షణాలేవీ లేవని తెలియడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. పంత్ గురించి మేం దిగులు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 16, 2021 / 12:05 PM IST
    Follow us on

    టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అండగా నిలిచారు. ప్రస్తుతం నిబంధనలు మారాయని తెలిపారు. నిజ జీవితంలో పూర్తిగా మాస్కులు ధరించడం కష్టమని వెల్లడించారు. ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న రిషబ్ పంత్ కు డెల్టా వేరియంట్ సోకడం గురువారం సంచలనం సృష్టించింది. అయితే పంత్ కు పాజిటివ్ వచ్చి ఎనిమిది రోజులైందని, ప్రస్తుతం లక్షణాలేవీ లేవని తెలియడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. పంత్ గురించి మేం దిగులు చెందడం లేదు. అతడి ఆరోగ్యం మెరుగవుతోంది. రెండు టెస్టుల్లో నెగిటివ్ రాగానే  జట్టుతో కలుస్తాడు అని గంగూలీ ఓ జాతీయ మీడియాకు తెలిపారు.