Rajinikanth And Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో క్వాలిటీ అనేది పెరిగిపోయింది. ప్రతి హీరో డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని దాన్ని క్వాలిటీగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోలు సైతం డిఫరెంట్ గా విభిన్నమైన పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా నాగార్జున లాంటి నటుడు సైతం ‘కుబేర’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం అనేది ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంటే స్టార్ హీరోలు సైతం మంచి పాత్ర దొరికితే విలన్ గా నటించి వాళ్ళని వాళ్ళు నటులుగా ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఒక గొప్ప తాటైతే వాళ్లకు వచ్చింది. మరి దీనికంతటికి నాగార్జుననే కారణమని చెప్పాలి. ఇక దీంతో పాటుగా రజినీకాంత్(Rajinikanth) హీరోగా లోకేష్ కనకరాజు(Lokesh Kanakaraj) దర్శకత్వంలో వస్తున్న కూలీ (Cooli) సినిమాలో కూడా నాగార్జున విలన్ పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ సినిమా కూడా ఇండస్ట్రీలో భారీ రికార్డులను కొల్లగొడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో లోకేష్ కనకరాజు జాగ్రత్తలు అయితే తీసుకున్నాడు.
Also Read: నితీష్ కుమార్ రెడ్డికి గిల్ మామ అవుతాడా? వారి మధ్య బంధుత్వం ఎప్పటినుంచి? వైరల్ వీడియో
ఇక నాగార్జున కి రజనీకాంత్ కి మధ్య ఈ సినిమాలో ఒక భీకరమైన ఫైట్ అయితే ఉండబోతుందట ఇందులో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు. ఎవరి వల్ల ఎమోషన్ అనేది పండుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మొత్తానికైతే 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా రజనీకాంత్ యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ వాళ్లకు ధీటుగా సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇకమీదట కూడా ఆయన చేయబోయే సినిమాలు చాలా రియలేస్టిక్ గా ఉండే విధంగా చూసుకుంటూ ఆయా పాత్రలను తీర్చిదిద్ది దర్శకులకు సైతం ఎలివేషన్స్ ఇచ్చే విధంగా రాసుకోవాలని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జైలర్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న రజనీకాంత్ ఇప్పుడు చేస్తున్న కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరి కూలీ సినిమాలో రజినీకాంత్ ని నాగార్జున డామినేట్ చేస్తాడా? లేదా నాగార్జున రజనీకాంత్ ను డామినేట్ చేస్తూ ముందుకు సాగుతాడా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళ ఆలోచన ధోరణిని మార్చుకొని ముందుకు సాగుతుండటం విశేషం…