https://oktelugu.com/

Subbu Heroine: ఎన్టీఆర్ ‘సుబ్బు’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎంత హాట్ గా తయారైందో చూస్తే ఆశ్చర్యపోతారు!

రుద్రరాజు సురేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఎన్టీఆర్ ని లవ్ స్టోరీ లో జనాలు అంగీకరించలేకపోయారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సోనాలి జోషి కి మంచి పేరొచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 19, 2024 / 04:50 PM IST

    Subbu Heroine

    Follow us on

    Subbu Heroine: కొంతమంది హీరోయిన్లు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటారు. అందం, నటన ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాకా ఇండస్ట్రీ లో అనుకున్న స్థాయికి చేరుకోలేక కేవలం రెండు మూడు సినిమాలకే పరిమితం అవుతూ, మాయం అయిపోతున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరైన సోనాలి జోషి గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఎవరీ అమ్మాయి?, ఇప్పటి వరకు ఎక్కడా ఈ పేరు వినలేదే అని అనుకుంటున్నారా?, గుర్తించుకోవడానికి ఆమె 10 సినిమాలు చేయలేదు. కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఎన్టీఆర్, ఆ తర్వాత మూడవ సినిమాగా ‘సుబ్బు’ అనే చిత్రం చేసాడు.

    రుద్రరాజు సురేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఎన్టీఆర్ ని లవ్ స్టోరీ లో జనాలు అంగీకరించలేకపోయారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సోనాలి జోషి కి మంచి పేరొచ్చింది. ఎవరో ఈ అమ్మాయి, బార్బీ హెయిర్ తో చూడముచ్చటగా ఉంది, ఈ సినిమా తర్వాత ఈమెకి మంచి అవకాశాలు రావొచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడం తో ఈమెకు అవకాశాలు రాలేదు. ఈ సినిమాకి ముందు ఆమె ‘సందడే సందడి’ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పెద్ద హిట్ కూడా అయ్యింది. సుబ్బు కూడా ఆ సినిమా లాగానే సూపర్ హిట్ అయ్యుంటే ఈమె స్థానం వేరేలా ఉండేదేమో, దురదృష్టం అంటే ఇదే. అయితే తెలుగు లో ఈమెకి అవకాశాలు రాకపోయినా, హిందీ లో పలు అవకాశాలు వచ్చాయి. కానీ అవి క్రేజ్ మూవీస్ లో మాత్రం కాదు, చిన్న సినిమాల్లో, బి గ్రేడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చేవి. అలా అందం, టాలెంట్ ఉన్న ఈ అమ్మాయి కెరీర్ ఆరంభంలోనే ఆగిపోయింది.

    అయితే సినిమాల పరంగా ఈమె ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో యాక్టీవ్ గానే ఉంది. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను కొన్ని సోషల్ మీడియా లో చూసి, ఇంత అందంగా ఉంది, రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతమంది కొత్త హీరోయిన్స్ కంటే ఎన్నో రెట్లు బెటర్ గా ఉంది, మళ్ళీ ఈమె హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చేయొచ్చు అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి సినిమాల మీద ఆసక్తి ఉందో లేదో అనే విషయం పక్కన పెడితే, డైరెక్టర్స్ ఎందుకు ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వడం లేదు అనే దానిపై సోషల్ మీడియా లో చర్చలు నడుస్తున్నాయి. ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.