https://oktelugu.com/

Kanchana: షాకింగ్..లారెన్స్ ‘కాంచన’ చిత్రాన్ని తెలుగులో ఆ హీరో చెయ్యాల్సిందా..? రిస్క్ చేసుంటే కెరీర్ వేరేలా ఉండేది!

'ముని' చిత్రం మొదలైన ఈ జానర్ ని కొనసాగిస్తే లారెన్స్ 'కాంచన' అనే చిత్రాన్ని తీసాడు. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇక ఈ జానర్ కి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాకి కొనసాగింపుగా 'కాంచన 2 ', 'కాంచన 3 ' వంటి చిత్రాలు కూడా విడుదల అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 22, 2024 / 07:56 AM IST

    Kanchana

    Follow us on

    Kanchana: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కామెడీ హారర్ జానర్ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే విడుదలైన ‘స్త్రీ 2 ‘ కామెడీ హారర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని సృష్టించింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టగలదు అని ఈ సినిమా నిరూపించి చూపించి చూపించింది. వచ్చే ఏడాది విడుదల అవ్వబోతున్న ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం కూడా కామెడీ హారర్ జానర్ కి సంబంధించినదే. అయితే దేశవ్యాప్తంగా ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ జానర్ ని ప్రారంభించిన ఘనత, కేవలం రాఘవ లారెన్స్ కి మాత్రమే దక్కుతుంది. ఆయనే ‘ముని’ చిత్రం తో ఈ జానర్ కి నాంది పలికాడు. అంతకు ముందు రజినీకాంత్ చంద్రముఖి చిత్రం వచ్చింది, అందులో కూడా కామెడీ ఉంది కానీ, పూర్తి స్థాయి కామెడీ మాత్రం కాదు.

    ‘ముని’ చిత్రం మొదలైన ఈ జానర్ ని కొనసాగిస్తే లారెన్స్ ‘కాంచన’ అనే చిత్రాన్ని తీసాడు. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇక ఈ జానర్ కి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కాంచన 2 ‘, ‘కాంచన 3 ‘ వంటి చిత్రాలు కూడా విడుదల అయ్యాయి. ఇవి కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘కాంచన 4 ‘ చిత్రం కూడా తెరకెక్కబోతుంది. ఇదంతా పక్కన పెడితే ‘కాంచన’ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని లారెన్స్ ముందుగా తానూ దర్శకత్వం మాత్రమే వహించి, వేరే హీరో తో ఈ సినిమాని చెయ్యాలని అనుకున్నాడట. అందుకు ఆయన తమిళం లో విక్రమ్, ధనుష్ వంటి వాళ్ళని సంప్రదించాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు.

    ఇక తెలుగు లో రామ్ పోతినేని ని సంప్రదించాడట. కానీ ఆయన కూడా రిస్క్ చేయడానికి ముందుకు రాలేదు. అలా ఎంతో మంది హీరోలను కలిసి, వాళ్లకి కథ చెప్పి, ఒప్పించే ప్రయత్నం చేసి విఫలమైన లారెన్స్, చివరికి ఆయనే హీరో గా మారి ఈ చిత్రాన్ని తీసాడు. ఫలితం అందరికీ తెలిసిందే. ఆరోజుల్లో ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన కాంచన 2 , కాంచన 3 వంటి చిత్రాలకు కూడా భారీ స్థాయి వసూళ్లు వచ్చాయి. కంచాయి 3 కి అయితే ఏకంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఇప్పుడు కాంచన 4 అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే దెయ్యం గా నటించబోతుందట. వచ్చే ఏడాది ప్రారంభం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.