https://oktelugu.com/

Japan : జపాన్ గురించి ఆసక్తికర విషయాలు.. తెలిస్తే షాక్ అవుతారు

ప్రపంచ దేశాల్లో జపాన్ దేశానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచమంతా 2024లో జీవిస్తే జపాన్ మాత్రం 2050లో జీవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ అసలు ఆలోచనలకు అందదు. ఈ దేశంలో ఉండే ప్రజలు కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2024 / 07:35 AM IST

    Japan

    Follow us on

    Japan: ప్రపంచ దేశాల్లో జపాన్ దేశానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచమంతా 2024లో జీవిస్తే జపాన్ మాత్రం 2050లో జీవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ అసలు ఆలోచనలకు అందదు. ఈ దేశంలో ఉండే ప్రజలు కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. దీనికి ముఖ్య కారణం ఇక్కడి ఆహార అలవాట్లే. ఏమీ లేని దేశం నుంచి ఇప్పుడు ప్రపంచంలోనే మూడో ఆర్థిక దేశంగా జపాన్ నిలిచింది. దీనికి ముఖ్య కారణం ఆ దేశ అలవాట్లు, వర్క్ డెడికేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఉండే ప్రజలు చాలా సమయపాలన పాటిస్తారు. తమ విధులను వారు నిర్వర్తిస్తారు. నాకెందుకు అని కాకుండా మన దేశం పైకి ఎదగాలనే భావనలో ఎక్కువగా ఉంటారు. అయితే సూర్యుడు ఉదయించే దేశంగా పిలిచే ఈ జపాన్‌లో ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి. మరి అవేంటో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి

    -జపాన్‌లో దాదాపుగా మూడు వేలకు పైగా దీవులు ఉన్నాయి. దేశ భూభాగంలో నాలుగు వంతుల్లో మూడు వంతులు పర్వతాలు, దీవులతోనే నిండి ఉంది.
    -జపాన్ దేశానికి రెండు జాతీయ జెండాలు ఉన్నాయి. పూర్వ కాలంలో రెండు జెండాలను ఉపయోగించారు. కానీ ప్రస్తుతం ఒక జెండాను మాత్రమే ఉపయోగిస్తారు.
    -ఈ దేశంలో రైళ్లు సరైన సమయానికి వెళ్తాయి. ఒకవేళ ఆలస్యమైన కేవలం 18 సెకన్లు మాత్రమే ఆలస్యం అవుతాయి.
    -పాడ్స్ అనే చిన్న ఇళ్లు ఇక్కడ ఉంటాయి. వీటిని క్యాప్సూల్ హోటల్స్ అంటారు. ట్రావెలర్స్ నిద్రపోవడానికి మాత్రమే వీటిని నిర్మించారు.
    -జపాన్‌లో భూకంపాలు, సునామీలు ఎక్కువగా వస్తుంటాయి. ఏడాదికి దాదాపుగా 1500 భూకంపాలు వస్తాయట.
    -ప్రపంచంలోనే శుభ్రంగా ఉండే దేశాల్లో జపాన్ ఒకటి. ఎక్కడ కూడా మీకు చాక్లెట్ కవర్ కనిపించదు. ఈ దేశంలోనే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉంది.
    -ఇక్కడ అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. పాఠశాలలు చాలా స్ట్రిట్‌గా ఉంటాయి.
    -జపాన్ సంప్రదాయ దుస్తుల పేరు కిమోనా. వీటిని వారు ప్రత్యేకమైన రోజులు, ఫంక్షన్, పెళ్లి ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా ధరిస్తారు.
    -వీరు తినే ఆహారం కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. తినే ఫుడ్‌లో ప్రొటీన్, కాల్షియం తింటారు. వీటివల్ల యంగ్‌గా ఉంటారు.
    -జపాన్‌లో పనిచేసే ఉద్యోగులు వర్క్ చేస్తుండగా మధ్యలో నిద్రపోవచ్చు.
    -ప్రపంచంలో ఎక్కడ దొరకని చతురస్రాకారపు పుచ్చకాయలు ఇక్కడ లభ్యమవుతాయి.
    -దేశంలో బర్గర్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది.
    -ఈ దేశంలో పురుషులు 78 ఏళ్లు, మహిళలు అయితే 84 ఏళ్లు జీవిస్తారట.
    -జపాన్‌లో రోడ్డు మీద వెళ్లే ఆటోమెటిక్ రైళ్లు ఉంటాయి. ఎలాంటి ట్రాక్స్ లేకుండా రోడ్డు పైన ఆటోమెటిక్‌గా వెళ్తుంటాయి.
    -సాధారణంగా కాలువలు ఎంత మురికిగా ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ జపాన్‌లో మాత్రం ఎక్వేరియం అంతా శుభ్రంగా ఉంటాయి.
    -అలాగే ఈ దేశంలో మొబైల్‌ను శుభ్రం చేసే శానిటైజ్‌లు కూడా ఉంటాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.