
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన కొద్ది రోజులకే వచ్చే సీజన్ నుంచి ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటానని కోహ్లీ ప్రకటించిన విషంయ తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా విరాట్ కోహ్లీకి మంచి ఘనతలే ఉన్నాయి. కానీ ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పు కొట్టకపోడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించే అంశమే. కోహ్లీ కెప్టెన్సీలో కచ్చితంగా కప్పు కొట్టాలన్న అభిమానుల ఆశలపై యాజమాన్యం నీళ్లు చల్లేలాగే కనిపిస్తోంది. అయితే ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అయితే మంజ్రేకర్ విచిత్రంగా ఇతర జట్ల ఆటగాళ్ల పేర్లు చెప్పాడు. అతడు సూచించిన పేర్లలో ముంబయి ఇండియన్స్ ప్రధాన ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఒకటి కాగా, రెండోది అదే జట్టుకు చెందిన సూర్యకుమార్ యాదవ్, ఇక మూడో ఆటగాడు సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్. ఒక వేల డివిలియర్స్ ను బెంగళూరు కెప్టెన్ గా ఎంపిక చేస్తే ఎంతకాలం కొనసాగుతాడని సందేహం వెలిబుచ్చాడు.
తన ఉద్దేశం ప్రకాం కనీసం మూడేల్లు ఒక ఆటగాడు కెప్టెప్ గా కొనసాగాలని అభిప్రాయపడ్డాడు. పొలార్డ్ వయసు కాస్త ఎక్కువే అయినా మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆటగాడని చెప్పాడు. ఎప్పుడూ అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేసిన జట్టు నుంచే నాయకుడిని ఎంపిక చేయాలని సూచించాడు. పొలార్డ్ లో కూడా మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాయని అన్నాడు. ప్రధానంగా ఏబీ డివిలియర్స్ పేరు వినిపిస్తోంది.