Honey Benefits: మనకు ప్రకృతి ప్రసాదించిన ఆహారాల్లో తేనె ఒకటి. తేనె తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన రోగ నిరోధక వ్యవస్త బాగుపడుతుంది. తేనె తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అనేకం. సహజమైన తేనె తీసుకోవడం వల్ల మన శరీరానికి ఉపశమనం కలుగుతుంది. పలు రకాల రోగాల నుంచి తేనె దూరం చేస్తుంది. తరచుగా తేనె తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. పూర్వ కాలం నుంచే మనకు తేనె తీసుకోవడం అలవాటుగా మారింది. మన పూర్వీకులు చెట్ల నుంచి తీసిన తేనెను తాగి వారి ఆకలి తీర్చుకుని ఆరోగ్యవంతులుగా జీవించారు. మనం మాత్రం ప్రస్తుతం కృత్రిమ తేనెతో కాలం గడుపుతున్నాం.

తేనె తీసుకోవడం వల్ల దగ్గు, గొంతు నొప్పి మాయమవుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా తేనె పట్టిస్తారు. రోజు ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా తేనె, నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రపోయే ముందు పాలలో తేనె కలుపుకుని తాగితే సుఖమైన నిద్ర పడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో మన ఆరోగ్యంపై తేనె ఎంతో ఉపయోగపడుతుంది. మనిషికి తేనె వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం.
ప్రకృతి వైద్య విధానంలో తేనెకు ప్రముఖ స్థానమే ఉంది. ప్రకృతి పరంగా తయారు చేసే స్వీట్లలో చక్కెరకు బదులు తేనెను వాడతారు. దీంతో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తపోటుకు కూడా పరిష్కారం చూపుతుంది. ఇలా తేనె ఎన్నో రకాల దీర్ఘకాల రోగాలకు మేలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. ఒక మనిషికి హిమోగ్లోబిన్ స్థాయి 16 గ్రాములు ఉండాలి. కానీ చాలా మందికి 12 నుంచి 14 గ్రాముల వరకే ఉంటుంది. తేనెను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

తేనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీంతో మనకు పలు రకాల ఉపయోగాలు కలుగుతున్నాయి. తేనెను ఉడికించి తీసుకోవద్దు. వేడి చేయవద్దు. తేనె చంటి పిల్లలకు వాడకూడదు. తేనె వల్ల మనకు ఒనగూరే ప్రయోజనాల్లో మంచి చేసేవే ఉన్నాయి. తేనెతో సహజసిద్ధమైన లాభాలుండటంతో దాన్ని తీసుకోవడం మంచిదే. రోజు తేనె తీసుకుని ఆరోగ్యవంతమైన వ్యవస్థ కోసం ప్రయత్నించాలి. ఇలా తేనెతో మనకు కలిగే ఉపయోగాలతో మన దేహం రోగాలు లేని తీరుగా మారుతుందనడంలో సందేహం లేదు.