Beer: చాలా మందికి మూత్ర పిండాల్లో రాళ్లు వస్తుంటాయి. వాటిని తొలగించుకునే క్రమంలో వైద్యులు నీళ్లు బాగా తాగాలని సలహా ఇస్తుంటారు. కిడ్నీల్లో రాళ్లు పోవాలంటే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. కొందరు మాత్రం కిడ్నీల్లో రాళ్లు కరగడానికి బీరు తాగితే సరిపోతుందని చెబుతుంటారు. ఇది అపోహ మాత్రమే. ఇందులో వాస్తవం లేదు. బీరు తాగడం వల్ల తరచుగా మూత్రం వస్తే రాళ్లు కరిగిపోయినట్లే అని భావిస్తుంటారు. కానీ ఇందులో నిజం లేదు. బీరు తాగడం వల్ల ఇంకా అనేక సమస్యలకు దారి తీస్తుంది. కానీ రాళ్లు కరుగుతాయనడంలో స్పష్టత లేదు. అందుకే బీరు తాగడం మానుకోవడమే ఉత్తమం.

బీరు తాగడం వల్ల మూత్రపిండాల సమస్యలు, వైఫల్యం, రక్తపోటు, క్యాన్సర్, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలకు కారణంగా మారుతుంది. బీరు తాగితే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని చెప్పడం తెలివితక్కువ తనమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన అంచనాల ప్రకారం బీరు తాగడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని అర్థమవుతోంది. బీరు తాగడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు బయటకు వస్తాయనడంలో ఎలాంటి ఆధారాలు మాత్రం కనిపించడం లేదు.
కొన్ని అధ్యయనాల్లో బీరు తాగడం వల్ల మూత్ర విసర్జన తరచుగా వస్తుందని తేలినా రాళ్లను కరిగించడంలో మాత్రం సాయపడదు. అయినా 5 మిల్లీమీటర్ల కంటే పెద్ద రాళ్లను బయటకు తీసుకురాలేదు. మూత్రపిండాల్లో సుమారు 3 మిల్లీ మీటర్ల వరకు ఉంటుంది. మూత్ర పిండాల్లో నొప్పిగా ఉన్నప్పుడు లేదా మూత్ర విసర్జన చేయలేనప్పుడు బీరు తాగితే ఇబ్బందులు కలుగుతాయి. బీరు తాగితే మూత్రం ఎక్కువ వస్తుంది కానీ రాళ్లు మాత్రం కరిగిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో బీరు అధికంగా తాగితే శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి. కిడ్నీల్లో టాక్సిన్స్ అనవసరమైన పోషకాలను మూత్రం ద్వారా తొలగిస్తాయి. రక్తంలో విషపూరిత మూలకాల పరిమాణం పెరిగినప్పుడు కిడ్నీలు సరిగా ఫిల్టర్ చేయకపోతే సమస్యలు వస్తాయి. ఫిల్టర్ సరిగా చేయకపోతే శరీరంలో వ్యర్థాలు ఘన రూపంలో పేరుకుపోయి రాళ్లుగా మారతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే పొత్తికడుపులో వెనుక భాగంలో ఆకస్మిక నొప్పి కలుగుతుంది. మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి లేదా మంటగా అనిపిస్తే వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు డాక్టర్లు నీళ్లు ఎక్కువగా తాగమంటారు కానీ బీరు తాగమని ఎవరు చెప్పిన దాఖలాలు లేవు. కానీ మనలో చాలా మంది బీరు తాగితే మూత్ర పిండాల్లో రాళ్లు పోతాయని అపోహతో ఎక్కువగా బీర్లు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాళ్లు కరిగిపోవడానికి మందులు వాడుతూ వైద్యుడి సలహాలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని బీరు తాగుతూ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకోవడం తెలివి తక్కువ పనిగానే చెప్పుకోవచ్చు.