https://oktelugu.com/

యాంకర్ రీతూ చౌదరి కొనుగోలు చేసిన ఈ కారు గురించి తెలుసా?

టయోటా కారు చెప్పగానే ఇన్నోవా గుర్తుకు వస్తుంది. 7 సీటర్ కలిగిన ఈ కారు మోస్ట్ పాపులర్ గా నిలిచింది. అయితే ఈ కారు అప్డేట్ వెర్షన్ లో ‘ఇన్నోవా హైక్రాస్’ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ మోడల్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 19, 2024 3:23 pm
    Reethu Chowdary TaTa Car

    Reethu Chowdary TaTa Car

    Follow us on

    సినీ ఇండస్ట్రీకి చెందిన వారు లగ్జరీ కార్లు కొనడం కామన్. లేటేస్టుగా యాంకర్ రీతూ చౌదరి ఓ కారు కొని వాటికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయినా ఈమె పలు సీరియళ్లలో నటించింది. తాను ఎంతో కష్టపడిన తరువాత ఈ కారును కొనుగోలు చేసినట్లు యాంకర్ రీతూ చౌదరి ఈ సందర్భంగా తెలిపింది. అయితే ఈ కారు గురించి ఆస్తికరంగా చర్చ సాగుతోంది. ఇంతకీ ఇది ఏ కారో తెలుసా?

    టయోటా కారు చెప్పగానే ఇన్నోవా గుర్తుకు వస్తుంది. 7 సీటర్ కలిగిన ఈ కారు మోస్ట్ పాపులర్ గా నిలిచింది. అయితే ఈ కారు అప్డేట్ వెర్షన్ లో ‘ఇన్నోవా హైక్రాస్’ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ మోడల్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో జీ, జీX, వీX, జడ్X, జడ్X(0) వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ‘ఇన్నోవా హైక్రాస్’ 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 172 బీహెచ్ పీ పవర్ తో పాటు 205 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

    ఈ మోడల్ లేటేస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇందులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. అలాగే 9 స్పీకర్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 4.2 అంగుళాల ఎంఐడీ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ తో సహా పలు ఫీచర్లు ఉన్నాయి. ఇది 7 సీటర్ తో పాటు 8 సీటర్ కూడా అందుబాటులో ఉంది. రెండు, మూడు వరుసల్లో బెంచ్ సీట్లు ఉన్నాయి. వీటితో పాటు లేటేస్ట్ అడాస్ టెక్నాలజీ, వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి ఉన్నాయి.

    ఇక ఇందులో సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎఉస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రాం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారును రూ. 18.30 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.28.97 లక్షల వరకు విక్రయించనున్నారు. ఇందులో సెల్ప్ చార్జింగ్ హైబ్రిడ్ వెర్షన్ ధర వేరియంట్ ను రూ.24 లక్షల నుంచి రూ.28.97 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం XUV700, టాటా సపారీ వంటి కార్లు అందుబాటులో ఉండగా.. వీటికి టాటా ఇన్నోవా హైక్రాస్ గట్టి పోటీ ఇవ్వనుంది.