Kannappa Character: రెబల్ స్టార్ కృష్ణం రాజు 50 ఏళ్ళ క్రితం తీసిన ‘కన్నప్ప’ (Kannappa Movie) చిత్రం ఆరోజుల్లో కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నప్ప అంటే కృష్ణం రాజు, కృష్ణం రాజు అంటే కన్నప్ప అనే విధంగా ఆ క్యారక్టర్ ని జనాల హృదయాల్లో గుర్తుండిపోయేలా చేసాడు. అయితే ఈ క్యారక్టర్ ని ఆయన నట వారసుడు రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) చేస్తాడేమో అని అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం నా వల్ల కాదు అని చేయలేదు. సుమారుగా 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ క్యారక్టర్ ని ప్రేక్షకుల ముందుకు నేడు తీసుకొచ్చాడు మంచు విష్ణు(Manchu Vishnu). కృష్ణం రాజు కన్నప్ప ని మరిపించేలా ఈ సినిమా లేదు కానీ, పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనే విధంగా మాత్రం ఈ చిత్రం ఉంది. ఓపెనింగ్స్ కూడా అదిరిపోతున్నాయి.
ఈ కథని మంచు విష్ణు ప్రముఖ సీనియర్ నటుడు/రచయిత తనికెళ్ళ భరణి(Tanikella Bharani) నుండి తీసుకొని, దానికి తుది మెరుగులు దిద్ది, పాన్ ఇండియన్ సబ్జెక్టు గా మలిచాడు. అయితే మంచు విష్ణు వద్దకు ఈ కథ చేరే ముందు తనికెళ్ళ భరణి ఈ కథని ఒక స్టార్ హీరో కి వినిపించాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan). గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తనికెళ్ళ భరణి ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ తో నాకు రామోజీ ఫిలిం సిటీ లో ఒక సంఘటన జరిగింది. అప్పటికే నేను కంపోజ్ చేయించిన ‘నాలో ఉన్న శివుడు’ అనే సీడీ మార్కెట్ లోకి వచ్చింది. షూటింగ్ సమయం లో ఉన్నప్పుడు ఊరికే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలని చెప్పి ఆయన అసిస్టెంట్ ని సార్ కారావాన్ లో ఉన్నాడా?, ఉంటే ఒకసారి నేనొస్తానని చెప్పవా’ అని అడిగాను.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ లోపలకు వెళ్లిన తర్వాత ఆయనకు ‘నాలో ఉన్న శివుడు’ సీడీ ఇచ్చాను. సరే అండీ వింటాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన నన్ను పిలిచాడు. లోపలకు వెళ్ళగానే నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నేను గొప్ప భక్తుడిని కాదు కానీ, మీ సీడీ విన్న తర్వాత నా మనసు లో ఒక విధమైన భావన కలిగింది. ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఈరోజు షూటింగ్ కి రాకూడదు అనుకున్నాను. కానీ నేను రాకపోతే కోట్లలో నష్టం వస్తుంది కాబట్టి రావాల్సి వచ్చింది. నాకు చాలా నచ్చింది. నేను ఎప్పుడైనా శివ భక్తుడి క్యారక్టర్ చేయాలనీ ఉంది అని అన్నాడు. కొన్నాళ్ల తర్వాత నా దగ్గర ఉన్న కన్నప్ప స్టోరీ వినిపించాను. చాలా బాగుంది అన్నాడు. దాదాపుగా ప్రారంభం అయ్యే దశలో, ప్రస్తుతం నేను ఫ్లాప్స్ లో ఉన్నాను, నా మీద ఇంత బడ్జెట్ ఇప్పుడు ఎవ్వరూ పెట్టరేమో, రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాక పెద్ద నిర్మాత దొరికితే చేద్దాం అని అన్నాడు. పర్లేదు సార్ నాకు తొందరేమీ లేదు అన్నాను. ఆ తర్వాత ఆయన పనుల్లో ఆయన బిజీ అయ్యాడు. ఈలోపు మంచు విష్ణు కథ అడిగితే ఇచ్చేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు.