Bigg Boss 9 Telugu: ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కి ఆడియన్స్ లో ఎంత మంది క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అన్ని ఏజ్ గ్రూప్ లకు సంబంధించిన వాళ్ళు ఈ షో కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టుగా సరికొత్త కాన్సెప్ట్స్ తో మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ టీం. ఇప్పుడు 9వ (Bigg Boss 9 Telugu) సీజన్ కి సంబంధించిన ప్రోమో ని నిన్న ఆడియన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ ఒక ప్రోమో ని విడుదల చేశారు. గెలుపు కోసం ఒక్కోసారి యుద్ధమే కాదు, ప్రభంజనం కూడా సృష్టించాల్సి ఉంటుంది. ఈసారి చదరంగం మాత్రమే కాదు , ప్రభంజనం కూడా సృష్టించబోతున్నాం అంటూ నాగార్జున(Akkineni Nagarjuna) డైలాగ్స్ బాగా హైలైట్ అయ్యింది.
Also Read: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ
కాన్సెప్ట్ అర్థం అయ్యి అవ్వనట్టుగా ఉంది. అయితే ప్రతీ సీజన్ కి సమందించిన ప్రోమో ని జులై చివర్లో కానీ, లేకపోతే ఆగష్టు మొదటి వారం లో కానీ విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈ సీజన్ లో మాత్రం రెండు నెలల ముందే విడుదల చేసారు. అలా విడుదల చేయడానికి ఒక కారణం కూడా ఉందట. ప్రతీ సీజన్ లో లాగా ఈ సీజన్ లో కేవలం సెలబ్రిటీలకు మాత్రమే కాదు, సామాన్యుడికి కూడా కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఉందట. ఈ సీజన్ లో 5 మంది సామాన్యులకు కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం కల్పించబోతున్నారట. త్వరలోనే రెండవ ప్రోమో ని విడుదల చేయబోతున్నారు. ఈ ప్రోమో లో సామాన్యులు బిగ్ బాస్ లోకి పాల్గొనాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది నాగార్జున చెప్పబోతున్నాడట. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీ అయిపోవాలని ఎవరికీ మాత్రం ఉండదు చెప్పండి?.
వేల సంఖ్యలో దరఖాస్తులు రావొచ్చు. అందులో నుండి ఒక 40 మంది ప్రొఫైల్స్ ని తీసుకొని ఇంటర్వ్యూ చేసి కేవలం 5 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఆ 5 మంది అదృష్టవంతులు ఎవరో రాబోయే రోజుల్లో చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఆది రెడ్డి ఒక ప్రత్యేకమైన వీడియో చేసాడు. దానిని క్రింద అందిస్తున్నాము,పూర్తిగా మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. కేవలం సీజన్ 2 లో మాత్రమే సామాన్యులకు బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆ తర్వాత సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ సామాన్య రైతు బిడ్డ అంటూ ఎంట్రీ ఇచ్చాడు కానీ, ఆయన హౌస్ లోకి రాకముందే ఇన్ స్టాగ్రామ్ లో టాప్ సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ సీజన్ లో సామాన్యుల క్యాటగిరీలో వచ్చే అవకాశం ఉందట.