Arvind Swamy : సౌత్ ఇండియా లో అందంగా పరంగా ఏ హీరోలు టాప్ లో ఉంటారు అనే లిస్ట్ తీస్తే అందులో మనం అరవింద్ గో స్వామి గురించి ముందుగా మాట్లాడుకోకుండా ఉండలేము. 1991 వ సంవత్సరం లో మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన రజినీకాంత్, మమ్మూటీ మల్టీస్టార్రర్ ‘తలపతి’ అనే చిత్రం ద్వారా ఈయన వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమాలో ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమ్ముడిగా నటించాడు. తొలిసినిమా తోనే ఈయన ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ దక్కించుకున్నాడు. స్క్రీన్ మీద ఉన్నంత ఆ ఇద్దరు హీరోలను కూడా డామినేట్ చేసేంత ఇతని అందాన్ని చూసి మణిరత్నం తన తదుపరి చిత్రం ‘రోజా’ లో హీరో గా నటించే అవకాశం అందించాడు. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం తెలుగు, తమిళం భాషల్లోనే కాదు, హిందీ లో కూడా ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.
ఈ చిత్రం తర్వాత అరవింద్ స్వామి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు. ఈయన మన తెలుగు ఆడియన్స్ కి ఎప్పటి నుండో సుపరిచితుడే కానీ, ఈ తరం ఆడియన్స్ కి మాత్రం ఈయన్ని బాగా దగ్గర చేసిన చిత్రం ‘ధృవ’. రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ చిత్రం లో అరవింద్ స్వామి మంచి స్టైలిష్ విలన్ గా, అద్భుతమైన యాటిట్యూడ్ తో నటించి మెప్పించాడు. ఆ తర్వాత నాగ చైతన్య తో ‘కస్టడీ’ అనే చిత్రం లో నటించాడు కానీ, ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇకపోతే రీసెంట్ గా అయన కార్తీ తో కలిసి చేసిన ‘సత్యం సుందరం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అలా మన ఆడియన్స్ కి బాగా దగ్గరైన అరవింద్ స్వామి కి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన 1994 వ సంవత్సరం లో గాయత్రీ అనే అమ్మాయిని పెళ్లాడాడు. వీళ్లిద్దరికీ అధీర అనే కూతురు, రుద్రా అనే కొడుకు ఉన్నాడు. అయితే గాయత్రీ తో అరవింద్ స్వామి కి ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. మళ్ళీ అరవింద్ స్వామి 2012 వ సంవత్సరం లో అపర్ణ ముఖర్జీ అనే అమ్మాయిని పెళ్లాడాడు. వీళ్లిద్దరికీ కూడా ఒక కొడుకు ఉన్నాడు. ఇకపోతే కూతురు అధీర కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని అందంతో ఉన్న ఈమె అతి త్వరలోనే సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. ఆమెకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా చూసేయండి.