Annamalai Viral Video : కమలం పార్టీని తమిళనాడులో అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను ఆకట్టుకునేందుకు తాజాగా శపథం చేశారు. రాష్ట్రంలో డీఎంకేను అధికారం నుంచి గద్దె దించే వరకూ చెప్పులు వేసుకోనని స్పష్టం చేశాడు. ఇక రాష్ట్రంలో దుష్ట పాలనను నిరసిస్తూ శుక్రవారం కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకుంటానని కూడా ప్రకటించారు.
ఇక తమిళనాడులో దుష్ట పాలన కారణంగానే అమ్మాయిలపై లైంగికదాడులు జరుగుతున్నాయని ఆన్నామలై ఆరోపించారు. ఇటీవల అన్న యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేదింపులకు నిరసనగా అన్నామలై కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ బాధితురాలే భయపడేలా ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రతిపక్షంగా తమ పని అని తెలిపారు. వాటికి సమధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అన్నా యూనివర్సిటీలో సీసీ కెమెరాలు లేవని చెప్పడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు తాను చెప్పులు వేసుకోని స్పష్టం చేశారు. శుక్రవారం అన్ని చెడులు తొలగిపోవాలని తన ఇంటి ఎదుట కొరడాదెబ్బలు కొట్టుకున్నారు. తమిళనాడులోని మురుగన్ ఆరు పవిత్ర క్షేత్రాలకు వెళ్లడానికి తాను 48 గంటలు దీక్ష చేస్తానని తెలిపారు.
తమిళనాట పరిస్థితులకు నిరసనగా అన్నామలై దీక్ష చేయబోతున్నారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.