
Das Ka Dhamki collections : కుర్ర హీరోలలో విపరీతమైన టాలెంట్ ఉండి కూడా ఇప్పటికీ స్టార్ స్టేటస్ కి రీచ్ కానీ హీరోల లిస్ట్ తీస్తే అందులో విశ్వక్ సేన్ కచ్చితంగా ఉంటాడు.ఇతగాడికి ఉన్న టాలెంట్ గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది.మొదటి సినిమా నుండే ఈ హీరో ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు.24 ఏళ్ళ వయసు లో తన రెండవ సినిమా ‘ఫలక్ నూమా దాస్’ కి దర్శకత్వం వహించి డైరెక్టర్ గా కూడా కెరీర్ లో సూపర్ హిట్ ని అందుకున్నాడు.
అంత చిన్న వయసులో హీరో గా చేస్తూ దర్శకత్వం కూడా వహించడం అంటే సాధారణమైన విషయం కాదు.ఆ తర్వాత కూడా ఇతను వైవిధ్యమైన పాత్రలు మరియు సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ, కెరీర్ లో మరో లెవెల్ కి వెళ్లలేకపొయ్యాడు.రీసెంట్ గా విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం అలాంటిదే అవుతుందని ఆశించాడు.కానీ సీన్ రివర్స్ అయ్యింది.ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలై వారం రోజులు అయ్యింది, ఈ వారం రోజులకు ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
మొదటి రోజు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మూడు కోట్ల రూపాయిల షేర్ వచ్చింది.ఇక ఆ తర్వాత రెండవ రోజు నుండి కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతూ వచ్చాయి.కానీ బ్రేక్ ఈవెన్ మార్కు కేవలం 7 కోట్ల 50 లక్షల రూపాయిలు మాత్రమే అవ్వడం తో వీకెండ్ కి అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ అయ్యింది.ఇప్పుడు సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంది.వారం రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
అంత బాగానే ఉంది కదా, ఎందుకు విశ్వక్ సేన్ బ్యాడ్ లక్ అని అంటున్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ కి వీకెండ్ లోపే 15 కోట్ల రూపాయిల మార్కు ని దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు, కానీ అది జరగలేదు అందుకే బ్యాడ్ లక్ అని సంబోదించాము.ఒకవేళ ఆ రేంజ్ వసూళ్లు వచ్చి ఉండుంటే విశ్వక్ సేన్ మార్కెట్ పెరిగి మరో లెవెల్ కి వెళ్ళేవాడిని ట్రేడ్ పండితులు అభిప్రాయం.