Daku Maharaj Collections : వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్న తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా బాలయ్య కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కారణంగా దారుణంగా దెబ్బ తినింది. పండగ సెలవుల వరకు ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది కానీ, ఆ తర్వాత మాత్రం అంతంత మాత్రం గానే వసూళ్లను రాబట్టి బయ్యర్స్ ని నిరాశకు గురి చేసింది. ఈ చిత్రం విడుదలై నిన్నటితో 11 రోజులు పూర్తి అయ్యింది. ఈ 11 రోజుల థియేట్రికల్ రన్ లో ఒక్క ఓవర్సీస్ లో తప్ప మిగిలిన ఏ ప్రాంతంలో కూడా బ్రేక్ ఈవెన్ కి నోచుకోలేదు ఈ చిత్రం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశాడు. 17 కోట్ల రూపాయలకు ఈ సినిమా నైజాం హక్కులు అమ్ముడుపోగా, ఇప్పటి వరకు కేవలం 10 కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ ని మాత్రమే రాబట్టింది. బాలయ్య కి సీడెడ్ ప్రాంతం ఎంతటి స్ట్రాంగ్ జోన్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ప్రాంతం లో ఈ సినిమాకి 16 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, ఇప్పటి వరకు 11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం లాభాల్లోనే ఉంది. 8 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉభయగోదావరి జిల్లాలకు కలిపి 12 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.
మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు కలిపి 70 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 61 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. థియేట్రికల్ రన్ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కష్టం లాగానే అనిపిస్తుంది. ఎంత భారీ వసూళ్లు వచ్చినా ఈ వీకెండ్ లోనే రావాలి,ఆ తర్వాత థియేట్రికల్ రన్ దాదాపుగా క్లోజ్ అయ్యినట్టే. ఓవర్సీస్ లో మాత్రం నిన్నటితో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. 8 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక లో మాత్రం నష్టాలే మిగిలాయి. విడుదలకు ముందు ఇక్కడ 5 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగితే, కేవలం ఇప్పటి వరకు 3 కోట్ల 90 లక్షలు మాత్రమే వచ్చాయి. వరాల గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 73 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.