CUET 2024 : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (Common University entrance test) ఫలితాలు శనివారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.. అధికారిక వెబ్ సైట్ లో టాపర్స్ జాబితా పీడీఎఫ్ ఫార్మాట్ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in లో ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు సబ్జెక్టుల వారీగా టాపర్ల జాబితాను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఈ ఏడాది నాన్సీ జైన్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు.
సబ్జెక్టుల వారీగా టాపర్లు వీరే
నాన్సీ జైన్ 217 మార్కులు
టెక్ చంద్ శర్మ: 225 మార్కులు.
ద్విజేంద్ర కుమార్ దూబే: 153 మార్కులు.
జితన్ దేవి: 225 మార్కులు.
శ్యాంసుందర్ పాండా: 215 మార్కులు.
ఏతి తివారి: 110 మార్కులు
అన్షుమన్ మిశ్రా: 285 మార్కులు
శుభం శాండిల్య: 291 మార్కులు
ఆయుష్ కుమార్ సింగ్: 225 మార్కులు
ప్రేక్ష జైన్: 287 మార్కులు
సిద్ధార్థ పాండే: 225 మార్కులు.
కామన్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ లో ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in ను సందర్శించాలి. ఈ వెబ్ సైట్ లో అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయాలి. వెంటనే సాధించిన మార్కులు డిస్ ప్లే అవుతాయి. అయితే ఈ పరీక్షలో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించిన వారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in ను సందర్శించవచ్చు.
గత నెల మార్చిలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. 4,62,725 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు రాసేందుకు 7,68,414 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 11 నుంచి 23 వరకు, మార్చి 27 నుంచి 28 వరకు ఈ పరీక్షలు జరిగాయి. 253 నగరాల్లో ఏర్పాటు చేసిన 565 కేంద్రాల్లో అత్యంత పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహించారు. మనదేశంలోనే కాకుండా మనామా, ఖాట్మండు, దుబాయ్, మస్కట్, రియాద్, ఒట్టావా, అబుదాబి, వియన్నా, దోహ ప్రాంతాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. రెండు సంవత్సరాల క్రితం అంటే 2022లో కేంద్రం ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశపెట్టింది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా కేంద్రం, రాష్ట్రాల ఆధీనంలోని విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తోంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 38 కేంద్రం, 38 రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు 114 ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లోనూ ప్రవేశం పొందొచ్చు.