Aamir Khan Coolie Movie: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది… ఎవరు ఏ భాషలో సినిమా చేసిన కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు అన్ని భాషల సినిమాలను చూసి దాన్ని జడ్జ్ చేస్తున్నాడు. తనకు నచ్చితే సినిమా నచ్చిందని చెబుతున్నాడు. లేకపోతే సినిమా అంత బాలేదు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. సినిమా చేసిన కూడా వాళ్లకి మంచి ఆదరణ అయితే దక్కుతోంది. ముఖ్యంగా ఓటిటి ప్లాట్ ఫామ్ వల్ల ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇంట్లో కూర్చొని అన్ని సినిమాలను వీక్షిస్తూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నాడు… ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజు లాంటి స్టార్ డైరెక్టర్ చేస్తున్న సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇప్పుడు రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమా ఆగస్టు 14 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది అంటూ లోకేష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా విచిత్రమైన విషయాలను తెలియజేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో రజనీకాంత్ ఉండడం వల్ల ఈ సినిమాకి భారీ హైప్ అయితే వచ్చిందని ఈ సినిమా స్టోరీ అతనికి తప్ప వేరే వాళ్లకు సెట్ అవ్వదు అని ఆయన చెప్పాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అమీర్ ఖాన్ ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. దానికి గల కారణం ఏంటి అంటే లోకేష్ కనకరాజు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సూర్యతో ‘ఇరుంభకం మాయావి ‘ అనే సినిమా చేశాడు. ఈ సినిమా లో సూర్యకి ఒక చేయి విరిగిపోతుంది.
Also Read: అవతార్ ట్రైలర్ రివ్యూ: ఈసారి మంట పెట్టే లాగానే ఉన్నాడే!
తను ఓన్ గా ఒక చేయి లేకపోయిన దానికి ఎలక్ట్రికల్ చేయిని ఎలా అమర్చుకోవాలి అనే ఒక ఐడియాతో తనకు తానే ఒక ఎలక్ట్రికల్ చేయిని తయారు చేసుకొని మార్చుకుంటాడు. దానివల్ల అతను ఏం చేశాడు అనేది సినిమా కథగా తెలుస్తోంది. అయితే మొదట్లో ఈ సినిమా కథ బాగుందని సూర్య కమిటీ అయ్యాడు. ఒక రెండు షెడ్యూల్స్ షూట్ చేసిన తర్వాత బడ్జెట్ ఎక్కువైపోతుండడం, అలాగే అప్పటికే లోకేష్ కనకరాజు కి డైరెక్షన్ మీద పెద్దగా నాలెడ్జ్ అయితే లేదు.
కొత్త కుర్రాడు కావడం వల్ల ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గారు. దాంతో ఆ సినిమా అక్కడే ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి సూర్య కూడా తప్పుకున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేశాడు. దాంతో లోకేష్ కనకరాజు ఈ సినిమాని అమీర్ ఖాన్ తో చేయాలని నిర్ణయించుకొని అతనికి కథ కూడా వినిపించాడు.
Also Read: అప్పుడు బాలయ్యకు ఇప్పుడు పవన్ కి… సేమ్ సీన్ రిపీట్!
దాంతో అమీర్ ఖాన్ కూడా ఆ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎలాగో సినిమా రాబోతోంది. కాబట్టి లోకేష్ కనకరాజు కూలీలో కూడా అమీర్ ఖాన్ ను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశ్యంతో అతని కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఖైదీ 2 సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…
The wait is over! The highly anticipated #Coolie Trailer from August 2#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges… pic.twitter.com/DWERTKRaGL
— Sun Pictures (@sunpictures) July 28, 2025