HomeNewsATA : ఆటా నాయకత్వ ఎన్నికలలో గందరగోళం...అసలు ఏం జరిగింది?

ATA : ఆటా నాయకత్వ ఎన్నికలలో గందరగోళం…అసలు ఏం జరిగింది?

ATA : అమెరికాలో తెలుగువారి కోసం పలు సంఘాలు ఉన్నాయి. అగ్రరాజ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిచడం, తెలుగువారి ఐక్యతను చాటేందుకు ఈ సంఘాలు పనిచేస్తున్నాయి. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా వచ్చే వారికి సహాయం చేస్తున్నాయి. ఇందుకోసం విరాళాల రూపంలో ఫండ్‌ సేకరిస్తున్నాయి. సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నాయి.

అమెరికా(America)లోని తెలుగువారి సంక్షేమం కోసం పనిచేసే సంఘాలకు ఏడాదికి లేదా రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తుంటారు. కార్యవర్గం నిర్ణయాల మేరకే వివిధ కార్యక్రమాల నిర్వహిస్తుంటారు. తాజాగా 2025 -27 సంవత్సరానికి అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఎన్నికలు జనవరి 18న నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా జయంత్‌ చల్లా ఎన్నికయ్యాడు. తర్వాత జరగాల్సిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికలు జరగకపోవడం, అక్కడి సభ్యులు గొడవ చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగించారు. ఈ విషయాన్ని నూతన అధ్యక్షుడే వెల్లడించడం గమనార్హం. అమెరికాలోని అతిపెద్ద సంస్థలుగా గుర్తింపు ఉన్న ఆటా, తానా సంస్థలు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ(TDP), కాంగ్రెస్‌(Congress) పార్టీల్లా మారాయని తెలిపారు. తానాలో ఉన్న మెజారిటీ సభ్యుల ప్రొఫైల్‌ తెలుగు దేశం పార్టీకి దగ్గరగా ఉంటుందని, తానా వ్యవహార శైలి మాత్రం కాంగ్రెస్‌ పార్టీలా ఉంటుందని విమర్శించారు. ఇక ఆటా సభ్యుల ప్రొఫైల్‌ కాంగ్రెస్‌కు దగ్గరగా ఉంటుందని, వ్యవహార శైలి మాత్రం టీడీపీలా ఉంటుందని, ఎవరూ ఎక్కడ, ఎపుపడూ మాట్లాడాకూడదు.. మాట్లాడరు అని వివరించాడు. తానాలో జరిగిన తప్పిదంపై ఆటాలో గొడవ జరగడం బాధాకరమని తెలిపారు.

జరిగింది ఇదీ..
ఆటా బైలాస్‌ ప్రకారం.. అధ్యక్షుడు ఎన్నిక తర్వాత సంస‍్థ బైలాస్‌(Bi-laws) ప్రకారం సభ్యులు ట్రస్టీని ఎన్నుకుంటారు. ఇందులో అన్నిప్రాంతాల వారు ప్రాతినిధ్యం వహించేలా ఎన్నుకుంటారు. ఎన్నికల తర్వాత 15 మంది కొత్త సభ్యులు, ఇప్పుడున్న వారిలో 16 మంది ట్రస్టీలు మొత్తం 31 మంది 2025-27 సంవత్సరానికి ఏరపడింది. అధ్యక్షుడు జయంత్‌ చల్లాతో కలిసి ఈ బోర్డ్‌ పనిచేస్తుంది. కొత్త కార్యవర్గ సమావేశం లాస్‌ వెగాస్‌(Las wegas)లో జనవరి 18, 19 తేదీల్లో జరిగింది. ఈ సమవేశానికి 200 మంది సభ్యులు హాజరయ్యారు. సంబరాలు చేసుకునే సమయంలో గొడవ జరిగింది. అయితే ఎన్నికల విషయమై కొంత మంది సభ్యులు అభ్యంతరం తెలుపడం గందరగోళానికి దారితీసింది. కొందరు ఎన్నికలు బహిరంగంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో గందరగోళం నెలకొంది. దీంతో అధ్యక్షుడు సమవేశం వాయిదా వేశారు.

సంఘంలో వర్గ విభేదాలు..
ఆటా సంఘంలో ఏడాదిగా విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. ఇవి మెల్లమెల్లాగా రెండు గ్రూపులుగా సభ్యులు విడిపోవడానికి కారణమైందని అంటున్నారు. ఇటీవల జరిగిన బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికల సమయంలో కూడా రెండు గ్రూపులు వారి వారి సభ్యులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కొత్తగాఎన్నికైన 15 మంది ట్రస్టీలు, పాత బోర్డు నుంచి కొనసాగే 16 మంది ట్రస్టీలు కలిపి వున్న 31 మంది లో కూడా కొంచెం అటూ ఇటుగా రెండు వర్గాలుగా అయిపోయాయని తెలుస్తోంది. అయితే కొందరు అటార్నీని ఫోన్‌లో సంప్రదించి ఆయన సూచన మేరకు కమిటీని ప్రకటించి సోషల్‌ మీడియా(Social Media)లో పోస్టు చేశారు. ఈ ప్రకటన ప్రకారం.. అనిల్‌ బోధిరెడ్డి ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా, శ్రీకాంత్ గుడిపాటి ట్రేజరర్‌గా , శ్రీమతి శారద సింగిరెడ్డి జాయింట్ సెక్రటరీగా , విజయ్ తూపల్లి జాయింట్ ట్రెజరర్ గా ప్రకటించినట్టు తెలిసింది. అయితే అధ్యక్షుడు జయంత్‌ చలా‍్ల మాత్రం బైలాస్‌ ప్రకారం ఎన్నికలు జరుపుతామని, ఓ వర్గం ప్రకటించిన కార్యవర్గం చెల్లదని స్పష్టం చేశారు. ఆటా పెద్దలు రెండు వర్గాల నాయకులతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 35 వేల మంది సభ్యులు, 34 ఏళ‍్ల చరిత్ర ఉన్న ఆటా సంస్థకు ఉన్న మంచిపేరు పాడు చేసే విధానం మంచిది కాదని పేర్కొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular