Coconut Water Vs Sugarcane Juice: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత నుంచి తట్టుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండ వేడి తగ్గకుండా రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇంట్లో ఉన్న ఉక్కపోతతో విలవిలలాడుతుండడంతో చల్లటి పానీయాలు సేవిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే బయట దొరికే కొబ్బరి బొండం నీళ్లు లేదా చెరుకు రసం తాగుతున్నారు. అయితే చాలామంది ఎక్కువగా చెరుకు రసం ను ఇష్టపడుతూ ఉంటారు. మరికొందరు కొబ్బరి నీళ్లు కావాలని కోరుకుంటారు. వాస్తవానికి రెండింటిలోనూ ఖనిజాలు అధికంగానే ఉంటాయి. ఈ రెండు పానీయాలు తక్షణ ఎనర్జీని ఇస్తాయి. కానీ రెండిటినీ పోలిస్తే మాత్రం ఏది బెటర్ అనే ప్రశ్న ఎదురవుతుంది. మరి రెండింటిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి? వీటిలో ఏది పెట్టారో ఒకసారి చూద్దాం..
Also Read: కూటమిపై విష ప్రచారం.. ప్రత్యేక బృందం వ్యూహం
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. వేసవికాలంలో ఉష్ణోగ్రత నుంచి తట్టుకోవడానికి.. డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగే ఎలాంటి అనారోగ్యం గురికాకుండా కాపాడుతుంది. అలాగే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా కొబ్బరినీళ్లు తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా అనారోగ్యానికి గురైనప్పుడు శరీరానికి శక్తిని ఇవ్వడానికి కొబ్బరి నీళ్లు గ్లూకోస్ లా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. వేసవికాలంలో మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఇక వేసవికాలంలో తెల్లదనాన్ని ఇచ్చే మరోపానియం చెరుకు రసం. చెరుకు రసం ఎక్కువగా వేసవిలో కనిపిస్తుంది. చెరుకు రసం తాగడం వల్ల మనసు హాయిగా ఇవ్వడంతో పాటు.. తక్షణ ఎనర్జీ వస్తుంది. చెరుకు రసంలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని రెగ్యులర్గా తీసుకున్న వారి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. వృద్ధాప్య కణాలు తొలగిపోయి అందంగా కనిపిస్తారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఎక్కువగా చెరుకు రసం ను తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా చెరుకు రసం టేస్టీగా ఉండడంతో చాలామంది దీనిని తాగేందుకు ఆసక్తి చూపుతారు.
అయితే కొబ్బరినీళ్లు, చెరుకు రసంలో ఏది బెటర్ అనే విషయానికి వస్తే.. కొబ్బరినీలే మంచిమని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో షుగర్ కంటెంట్ చెరుకు రసం కంటే తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడడానికి కొబ్బరి నీరు తక్షణ సాయం చేస్తుంది. అయితే చెరుకు రసంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా డయాబెటిస్ వ్యాధి వారు దీనిని తాగలేరు. అలాగని కొబ్బరి నీళ్లను కూడా తాగలేరు కానీ కొబ్బరి నీళ్లలో కంటే చెరుకు రసం లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. చెరుకు రసం వేసవిలో మాత్రమే కనిపిస్తుంది. కొబ్బరినీళ్లు మార్కెట్లో విరివిగా కనిపిస్తూ ఉంటాయి. చెరుకు రసం కొన్ని ప్రదేశాల్లో మాత్రమే లభ్యమవుతుంది. అయితే రెండిటిలో ఏది బెస్ట్ అనుకోకుండా.. సందర్భం వచ్చినప్పుడు రెండింటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
Also Read: జగన్ కు ముందే జిల్లాల పర్యటన.. షర్మిల స్కెచ్ అదే!