https://oktelugu.com/

భారత్‌ చీఫ్‌ సెలక్టర్‌‌గా చేతన్‌ శర్మ

చేతన్‌ శర్మ.. 1987 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు నమోదు చేసిన క్రికెటర్‌‌. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌‌గా ఆయన అప్పట్లోనే అరుదైన రికార్డు సాధించాడు. తాజాగా అతడిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ).. భారత క్రికెట్ జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసింది. అతనితోపాటు మాజీ క్రికెటర్లు దేబావిస్ మొహంతీ, అభయ్ కురువిల్లాకి కూడా సెలక్షన్ కమిటీ‌లో చోటు లభించగా.. మొత్తంగా సెలక్షన్ కమిటీలో సభ్యుల సంఖ్య ఐదుకి చేరింది. ఇప్పటికే ఫ్యానల్‌లో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 25, 2020 / 06:16 PM IST
    Follow us on


    చేతన్‌ శర్మ.. 1987 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు నమోదు చేసిన క్రికెటర్‌‌. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌‌గా ఆయన అప్పట్లోనే అరుదైన రికార్డు సాధించాడు. తాజాగా అతడిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ).. భారత క్రికెట్ జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసింది. అతనితోపాటు మాజీ క్రికెటర్లు దేబావిస్ మొహంతీ, అభయ్ కురువిల్లాకి కూడా సెలక్షన్ కమిటీ‌లో చోటు లభించగా.. మొత్తంగా సెలక్షన్ కమిటీలో సభ్యుల సంఖ్య ఐదుకి చేరింది. ఇప్పటికే ఫ్యానల్‌లో సునీల్ జోషి, హర్విందర్ సింగ్ ఉన్నారు.

    వాస్తవానికి భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికవుతాడని అంతా ఊహించారు. కానీ.. గతంలో ముంబయి చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్.. అప్పట్లో కనీసం మ్యాచ్‌లు కూడా చూసేవాడు కాదనే వాదనను తాజాగా ముంబయి క్రికెట్ సంఘం తెరపైకి తెచ్చి అతనికి తమ మద్దతు ఇవ్వలేదు. దాంతో వెస్ట్ జోన్ నుంచి అగార్కర్‌‌‌ని పక్కన పెట్టి కురువిల్లాకి సీఏసీ ఓటేసింది. భారత అండర్-19 సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కురువిల్లా ఉన్న సమయంలోనే 2012లో భారత యువ జట్టు ప్రపంచకప్ గెలవడాన్ని సీఏసీ పరిగణలోకి తీసుకుంది.

    ఇప్పటివరకూ సునీల్ జోషి చీఫ్ సెలెక్టర్‌గా ఉండగా.. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఎక్కువ టెస్టులు ఆడిన వ్యక్తి చీఫ్ సెలెక్టర్‌గా ఉంటాడు. దాంతో.. సునీల్ జోషి (15 టెస్టులు) కంటే ఎక్కువ టెస్టులు ఆడిన చేతన్ శర్మ (23 టెస్టులు) చీఫ్ సెలెక్టర్ కావడం లాంఛనమైంది. చేతన్ శర్మ చైర్మన్‌గా సెలక్షన్ కమిటీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కి జట్టుని ఎంపిక చేయనుంది.

    Tags