https://oktelugu.com/

నూతన వ్యవసాయ చట్టాలపై మోడీ ఆవేదన.. హాట్ కామెంట్స్

ఢిల్లీలో పట్టువీడని రైతుల ఆందోళన ఓవైపు.. ప్రపంచదేశాల్లో రైతుల ఆందోళనపై కేంద్రంలోని మోడీ సర్కార్ పరువు పోతున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తన మనోభావాలను పంచుకున్నారు. రైతుల ఆందోళనపై దుష్ర్పచారాలు చేస్తున్నారంటూ ఆవేదన చెందారు. వ్యవసాయ సంస్కరణల గురించి అసంఖ్యాక అబద్ధాలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రధాని మోడీ వాపోయారు.. మద్ధతు రద్దు చేస్తున్నట్లు కొంతమంది రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని.. మార్కెట్లు మూసేస్తున్నారని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన కొన్ని రాజకీయ పార్టీలు రైతులను తప్పుదోవ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 25, 2020 / 06:14 PM IST
    Follow us on

    ఢిల్లీలో పట్టువీడని రైతుల ఆందోళన ఓవైపు.. ప్రపంచదేశాల్లో రైతుల ఆందోళనపై కేంద్రంలోని మోడీ సర్కార్ పరువు పోతున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తన మనోభావాలను పంచుకున్నారు. రైతుల ఆందోళనపై దుష్ర్పచారాలు చేస్తున్నారంటూ ఆవేదన చెందారు. వ్యవసాయ సంస్కరణల గురించి అసంఖ్యాక అబద్ధాలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రధాని మోడీ వాపోయారు.. మద్ధతు రద్దు చేస్తున్నట్లు కొంతమంది రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని.. మార్కెట్లు మూసేస్తున్నారని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన కొన్ని రాజకీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ చట్టాలు అమలై చాలా నెలలు గడిచిపోయాయని.. దేశంలోని ఏ మూలలోనైనా ఏదైనా మార్కెట్ మూసేసారన్న వార్తలను మీరు విన్నారా? అని మోడీ ప్రశ్నించారు.

    ‘చట్టాలతో మీరు మీ ఉత్పత్తులను మీకు కావలసిన వారికి అమ్మొచ్చు… మీకు సరైన ధర లభించే చోట అమ్మొచ్చు. మీ ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్మాలనుకుంటే అమ్మొచ్చు… మార్కెట్లో అమ్మాలనుకుంటే అమ్మొచ్చు… ఎగుమతి చేయాలనుకుంటే ఎగుమతి చేయవచ్చు.. వ్యాపారికి అమ్మాలనుకుంటే అమ్మొచ్చు.. ఈ వ్యవసాయ సంస్కరణల ద్వారా మేం రైతులకు మెరుగైన అవకాశాలు ఇచ్చాం.’ అని మోడీ కొత్త వ్యవసాయ చట్టాలపై ఏకరువు పెట్టారు. దేశంలోని రైతుకు ఇన్ని హక్కులు ఇస్తే తప్పేంటి? రైతులు తమ ఉత్పత్తులను సంవత్సరంలో ఎక్కడైనా ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశాన్ని పొందుతుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు.

    దేశంలోని రైతుకు పొలంలో తగిన నీటిపారుదల సౌకర్యాలు ఉండాలనే లక్ష్యంతో పనిచేశామని… దశాబ్దాలపాటు పెండింగ్ లో ఉన్న నీటిపారుదల పథకాలను పూర్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా పర్ డ్రాప్-మోర్ క్రాప్ నినాదంతో సూక్ష్మ నీటిపారుదలని ప్రోత్సహిస్తున్నామని మోడీ తెలిపారు. పంటను విక్రయించడానికి రైతుకు కొత్త మార్కెట్ ఉండాలని దేశంలోని వెయ్యికి పైగా వ్యవసాయ మార్కెట్ లను ఆన్‌లైన్‌లో చేర్చామన్నారు.. వీటిలో లక్ష కోట్లకు పైగా వర్తకం జరిగిందని వివరించారు. గత కొన్ని నెలల్లో సుమారు 2.5 కోట్ల మంది చిన్న రైతులను కిసాన్ క్రెడిట్ కార్డుతో అనుసంధానించాం. ఇప్పుడు మత్స్యకారులు, పాడి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను ఇస్తున్నామని తెలిపారు.

    కొత్త వ్యవసాయ చట్టాలపై కొందరు రాజకీయం చేస్తున్నారని.. కాంట్రాక్టు వ్యవసాయంపై ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ సంస్కరణల గురించి అసంఖ్యాక అబద్ధాలు వ్యాప్తి చెందిస్తున్నారని మోడీ విమర్శించారు. మద్దతు ధరను రద్దు చేస్తున్నట్లు కొంతమంది రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. మార్కెట్లు మూసేస్తున్నారని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన కొన్ని రాజకీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.