HomeNewsPM Narendra Modi : ప్రధాని విశాఖ పర్యటన.. ఆత్మీయ స్వాగతం.. రోడ్డు షో సక్సెస్!*

PM Narendra Modi : ప్రధాని విశాఖ పర్యటన.. ఆత్మీయ స్వాగతం.. రోడ్డు షో సక్సెస్!*

PM Narendra Modi :  ఏపీలో ప్రధాని మోదీ( Narendra Modi) పర్యటన కొనసాగుతోంది. విశాఖలో ఈ సాయంత్రం అడుగు పెట్టారు ప్రధాని మోదీ. సాయంత్రం 4:30 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో ప్రత్యేక విమానంలో దిగిన మోడీకి సీఎం చంద్రబాబుతో( CM Chandrababu) పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) స్వాగతం పలికారు. విశాఖలో రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. అంతకంటే ముందే విశాఖలో భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం ఈ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేశారు. ఐఎన్ఎస్ డేగా( INS Daga ) నుంచి సిరిపురం జంక్షన్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ ముగ్గురు నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో( AU Engineering College Ground) ఏర్పాటు చేసిన సభా వేదికకు వెళ్లారు ప్రధాని మోదీ. అప్పటికే లక్షలాది మంది జనం సభా ప్రాంగణంలో ఉన్నారు. ఒక్కసారిగా జనకేరింతలు ప్రారంభమయ్యాయి.

* రోడ్ షో విజయవంతం
కాగా ప్రధాని మోదీ కోసం విశాఖ నగరవాసులు నిరీక్షించడం కనిపించింది. దారి పొడవునా పూలు చల్లి స్వాగతం పలికారు. అడుగడుగునా ఆత్మీయ పలకరింపులతో ముందుకు సాగింది రోడ్ షో( road show). ప్రజలకు అభివాదం చేస్తూ… చిరు మందహాసంతో సాగర నగర వాసులకు పలకరించారు ప్రధాని మోదీ. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దగ్గర నుండి చూసిన విశాఖ నగర ప్రజలు ఎంతో ఆనందించారు.

* భద్రతా వలయంలో నగరం
ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ నగరం ( Visakhapatnam)భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. కేంద్ర బలగాలతో పాటు ఏపీ పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్( Nara Lokesh) గత మూడు రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బిజెపికి చెందిన కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్, మంత్రి అచ్చెనాయుడు ప్రత్యేకంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మూడు పార్టీల నేతలు సమన్వయంతో పని చేశారు. ఈ సందర్భంగా విశాఖలో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. మూడు పార్టీల అగ్రనేతల ఫోటోలతో నిండిపోయాయి.

* సీఎం రమేష్ ప్రసంగం
సభా వేదికపై అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్( CM Ramesh) ముందుగా మాట్లాడారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో లక్ష 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం జన్మ ధన్యమైందని చెప్పుకొచ్చారు. కాకా సభా వేదిక నుంచి విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

* ఉత్తరాంధ్ర నుంచి తరలివచ్చిన జనం
కాగా విశాఖలో ప్రధాని పర్యటనకు ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా విశాఖ నగరంతో పాటు గ్రామీణ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలిరావడం విశేషం. విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం( TDP government) ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో… కేంద్రం కూడా ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తోంది. అదే సమయంలో విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా( IT hub) మార్చాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ తరుణంలో ప్రధాని నేరుగా వచ్చి లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై విశాఖ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular